Yagnam Movie: వామ్మో.. గుర్తుపట్టనంతగా మారిపోయిన ‘యజ్ఞం’ హీరోయిన్.. అసలు ఊహించి ఉండరు..

|

Sep 21, 2024 | 11:33 AM

ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. ఆ తర్వాత సినిమాలకు దూరమైనవారిలో సమీరా బెనర్జీ ఒకరు. తెలుగులో ఒక్కటే సినిమాతో అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలనే పక్కనపెట్టిసింది. సమీరా బెనర్జీ అంటే అంతగా గుర్తుపట్టరు.. కానీ యజ్ఞం మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు.

Yagnam Movie: వామ్మో.. గుర్తుపట్టనంతగా మారిపోయిన యజ్ఞం హీరోయిన్.. అసలు ఊహించి ఉండరు..
Yagnam Movie
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ సందడి చేస్తూనే ఉంటారు. మరోవైపు ఒకప్పటి తారలు వెండితెర నుంచి కనుమరుగవుతుంటారు. ఒకట్రెండు చిత్రాలతో ఒక్కసారిగా క్రేజ్ సొంతం చేసుకున్న తారలు.. ఆ తర్వాత మాత్రమే అనుహ్యంగా సినిమాలకు దూరమైపోతుంటారు. పెళ్లి, పిల్లలు అంటూ పూర్తిగా ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తారు. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సహయ పాత్రలు పోషిస్తుంటారు. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. ఆ తర్వాత సినిమాలకు దూరమైనవారిలో సమీరా బెనర్జీ ఒకరు. తెలుగులో ఒక్కటే సినిమాతో అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలనే పక్కనపెట్టిసింది. సమీరా బెనర్జీ అంటే అంతగా గుర్తుపట్టరు.. కానీ యజ్ఞం మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు.

సమీరా బెనర్జీ.. అలియాస్ మూన్ బెనర్జీ. టాలీవుడ్ హీరో గోపిచంద్ నటించిన యజ్ఞం సినిమాలో కథానాయికగా నటించింది. అటు హీరోగా గోపిచంద్ కు.. ఇటు హీరోయిన్ మూన్ బెనర్జీకి ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కోల్ కతాకు చెందిన మూన్ బెనర్జీ 1997 నుంచి హిందీ సీరియల్స్ చేస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మూన్ బెనర్జీ.. సీరియల్స్ మధ్యలోనే హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. యజ్ఞం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. కానీ ఆ తర్వాత తెలుగులో మరో ప్రాజెక్ట్ చేయలేదు.

ఇవి కూడా చదవండి

అంతేకాదు మరో భాషలోనూ ఈ బ్యూటీ సినిమాలు చేయలేదు. కానీ మొదటి నుంచి సీరియల్స్ చేస్తూ వచ్చింది.ప్రస్తుతం హిందీలో దోరీ అనే సీరియల్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ చూసి షాకవుతున్నారు నెటిజన్స్. వయసు పెరగడంతో బొద్దుగా మారి అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అటు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న మూన్ బెనర్జీ 2010లో నీరజ్ శర్మ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.