Tollywood: దండుపాళ్యం హీరోయిన్ ఇప్పుడిలా మారిపోయిందేంటి.? చూస్తే షాక్ అవ్వాల్సిందే

|

Oct 13, 2024 | 8:15 AM

దండుపాళ్యం చిత్రం మీకు గుర్తుందా.? 2012లో వచ్చిన ఈ మూవీ యదార్ధ సంఘటనలు ఆధారంగా తెరకెక్కింది. దర్శకుడు శ్రీనివాస్ రాజు ఈ క్రైమ్ థ్రిల్లర్ రూపొందించగా.. అటు కన్నడం, ఇటు తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచింది.

Tollywood: దండుపాళ్యం హీరోయిన్ ఇప్పుడిలా మారిపోయిందేంటి.? చూస్తే షాక్ అవ్వాల్సిందే
Dandupalyam Beauty
Follow us on

దండుపాళ్యం చిత్రం మీకు గుర్తుందా.? 2012లో వచ్చిన ఈ మూవీ యదార్ధ సంఘటనలు ఆధారంగా తెరకెక్కింది. దర్శకుడు శ్రీనివాస్ రాజు ఈ క్రైమ్ థ్రిల్లర్ రూపొందించగా.. అటు కన్నడం, ఇటు తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఆ తర్వాత ఈ మూవీకి సిరీస్‌గా నాలుగు చిత్రాలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. దండుపాళ్యం సినిమాలో పూజ గాంధీ ప్రధాన పాత్రలో పోషించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఆమె నటన సినిమాకు హైలైట్‌గా నిలిచింది. క్రూరంగా హత్యలు చేస్తూ, బోల్డ్‌గా నటించిన ఈమె ప్రేక్షకులను తన నటనతో భయపెట్టేసింది. కన్నడ కస్తూరి అయిన పూజా గాంధీ.. ఎక్కువగా కన్నడ చిత్రాల్లోనే నటించింది. అలాగే హిందీ, బెంగాలీ, తమిళ, మలయాళం చిత్రాల్లోనూ మెరిసింది ఈ బ్యూటీ. పూజా గాంధీ తన కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేసినా.. దండుపాళ్యం చిత్రంతోనే మంచి క్రేజ్ సంపాదించింది.

దాదాపుగా పదేళ్ల సినీ కెరీర్‌లో సుమారు 50 సినిమాల్లో నటించింది పూజా గాంధీ. అలాగే నిర్మాతగా ‘అభినేత్రి’ అనే కన్నడ చిత్రాన్ని కూడా నిర్మించింది ఈ బ్యూటీ. ఈమె చివరిగా దండుపాళ్యం 3 సినిమాలో కనిపించింది. ఇక ఈ వయ్యారి 2021 తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. గతేడాది వ్యాపార వేత్త విజయ్ ఘోర్పడేను పెళ్లాడిన పూజా గాంధీ.. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉంటుంది. తన రెగ్యులర్ ఫోటోలు, వెకేషన్ పిక్స్ మొదలగునవి షేర్ చేస్తోంది. సినిమాల్లో క్రూరంగా, బోల్డ్‌గా కనిపించిన ఈ బ్యూటీ.. నిజజీవితంలో ఎంతో అందంగా, సింపుల్‌గా ఉంటుంది. ఇక ఈమె ఇటీవల బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. లేట్ ఎందుకు మీరూ ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఒక్క సినిమాతో స్టార్‌డమ్.. వ్యభిచార కేసుతో కెరీర్ మటాష్.. ఈ బ్యూటీ ఎవరో తెల్సా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి