CID Serial: సీఐడీ సీరియల్ అభిజిత్ గుర్తున్నాడా ?.. ఇప్పుడు ఎంతగా మారిపోయాడో చూస్తే షాకవుతారు..
ఇన్‌స్పెక్టర్ అభిజీత్ కూడా ఒకరు. హీరో రేంజ్ కటౌట్.. తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఈ సీరియల్ తర్వాత అభిజిత్ మళ్లీ కనిపించలేదు. చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు 'భక్షక్' సినిమాలో కీలకపాత్రలో కనిపించాడు. అభిజిత్ ను చూసి ఎమోషనల్ అవుతున్నారు నెటిజన్స్. అభిజీత్ అసలు పేరు ఆదిత్య శ్రీవాస్తవ. అతను బాండిట్ రాజా, గులాల్ వంటి అనేక అవార్డులను అందుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ దర్శకత్వం వహించిన 'భక్షక్' చిత్రంలో నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నాడు.

బుల్లితెరపై CID సీరియల్ ఎంతగా సక్సెస్ అయ్యిందో చెప్పక్కర్లేదు. హిందీలో తెరకెక్కించిన ఈ సీరియల్ ను తెలుగులోకి డబ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ సీరియల్లోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. ఇందులో ఇన్‌స్పెక్టర్ అభిజీత్ కూడా ఒకరు. హీరో రేంజ్ కటౌట్.. తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఈ సీరియల్ తర్వాత అభిజిత్ మళ్లీ కనిపించలేదు. చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ‘భక్షక్’ సినిమాలో కీలకపాత్రలో కనిపించాడు. అభిజిత్ ను చూసి ఎమోషనల్ అవుతున్నారు నెటిజన్స్. అభిజీత్ అసలు పేరు ఆదిత్య శ్రీవాస్తవ. అతను బాండిట్ రాజా, గులాల్ వంటి అనేక అవార్డులను అందుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ దర్శకత్వం వహించిన ‘భక్షక్’ చిత్రంలో నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నాడు. తాజాగా విడుదలైన ట్రైలర్ లో అభిజిత్ కనిపించాడు.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అభిజిత్ అలియాస్ ఆదిత్య మాట్లాడుతూ.. రెడ్ చిల్లీస్ అధినేత గౌరవ్ తనను ఈ మూవీలో విలన్ పాత్రలో నటించాలని కోరినట్లు తెలిపారు. 20 ఏళ్లుగా సీఐడీలో ఉన్న అతన్ని అందరూ చూశారు. ‘బ్లాక్ ఫ్రైడే’, ‘గులాల్’ వంటి చిత్రాల్లో అద్భుతంగా నటించాడు. చాలా కాలం పాటు అదే సీరియల్లో నటించిన అతను ఇప్పుడు సరికొత్తగా ఏదైనా చేయాలని అనుకున్నారట. భక్షక్ స్టోరీ చెప్పగానే వెంటనే ఒప్పుకున్నానని అన్నారు. అయితే ఇన్నాళ్లు బుల్లితెరపై హీరోగా కనిపించిన ఆదిత్య ఇప్పుడు వెండితెరపై ప్రతినాయకుడిగా ఎలా కనిపిస్తాడనేది చూడాలి.
‘భక్షక్’ చిత్రంలో బ్రజేష్ సింగ్ పాత్రలో ఆదిత్య కనిపించనున్నాడు. ఇందులో భూమి ఫడ్నేకర్ జర్నలిస్ట్ వైశాలి పాత్రలో నటిస్తుంది. బీహార్‌లో జరిగిన భయానక సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఆదిత్య శ్రీవాస్తవ, సాయి తమంకర్‌లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. బాలికలపై జరుగుతున్న ఆఘాయిత్యాలు.. అసలు నిజాలను న్యాయం ముందుకు తీసుకురావడానికి ఓ జర్నలిస్ట్ చేసే పోరాటమే భక్షక్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




