Mangalavaram Movie: ‘మంగళవారం’ సినిమాలో జమీందార్ భార్య ఎవరో తెలుసా ?.. అస్సలు ఊహించి ఉండరు..
నవంబర్ 17న విడుదలై ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియాలో మరో నటి గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. మంగళవారం కథను మలుపు తిప్పిన ఆ పాత్రలోని అమ్మాయి ఎవరు ?.. అంటూ చర్చ జరుగుతుంది. మంగళవారం చిత్రంలో జమీందార్ భార్య రాజేశ్వరీ దేవి పాత్ర ప్రేక్షకులకు ఆకట్టుకుంది. అందంగా, పద్ధతిగా కనిపిస్తుంది. ఊరి ప్రజలకు పెద్ద దిక్కుగా కనిపిస్తుంది. ఆమెకు చేతులెత్తి మొక్కుతారు. కానీ చివరకు క్లైమాక్స్ లో ఊరి ప్రజలకే కాదు.. అడియన్స్ కు కూడా దిమ్మతిరిగే ట్విస్ట్ ఇస్తుంది.
ఆర్ఎక్స్ 100 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి.. ఇప్పుడు మంగళవారం మూవీ తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్ర పోషించింది. ఇందులో నందిత శ్వేత, దివ్య పిళ్లై, కీలకపాత్రలలో నటించారు. ఈనెల 17న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీలో మొదటి నుంచి పాయల్ రాజ్ పుత్ గురించి మాట్లాడుకున్నారు. నవంబర్ 17న విడుదలై ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియాలో మరో నటి గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. మంగళవారం కథను మలుపు తిప్పిన ఆ పాత్రలోని అమ్మాయి ఎవరు ?.. అంటూ చర్చ జరుగుతుంది. మంగళవారం చిత్రంలో జమీందార్ భార్య రాజేశ్వరీ దేవి పాత్ర ప్రేక్షకులకు ఆకట్టుకుంది. అందంగా, పద్ధతిగా కనిపిస్తుంది. ఊరి ప్రజలకు పెద్ద దిక్కుగా కనిపిస్తుంది. ఆమెకు చేతులెత్తి మొక్కుతారు. కానీ చివరకు క్లైమాక్స్ లో ఊరి ప్రజలకే కాదు.. అడియన్స్ కు కూడా దిమ్మతిరిగే ట్విస్ట్ ఇస్తుంది. రాజేశ్వరి దేవి పాత్ర ప్రేక్షకులకు ఎక్కువగా గుర్తుండిపోయింది.
జమీందార్ భార్య రాజేశ్వరి దేవీ పాత్రలో నటించిన హీరోయిన్ దివ్య పిళ్లై. మలయాళీ నటి. అక్కడ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాకుండా తమిళంలోనూ నటించి మెప్పించింది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, నయనతార, సమంత కాంబోలో వచ్చిన తమిళ చిత్రం కాతువాకుల రెండు కాదల్ సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించింది. ఇక ఇప్పుడు మంగళవారం సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది.
View this post on Instagram
నిజానికి దివ్య పిళ్లైకి మంగళవారం సినిమా మొదటి తెలుగు చిత్రం కాదు. నవీన్ చంద్ర నటించిన తగ్గేదేలే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోకుపోవడంతో తెలుగులో క్లిక్ కాలేకపోయింది. కానీ ఇప్పుడు మంగళవారం సినిమాతో ఈ బ్యూటీకి క్రేజ్ ఎక్కువగానే వచ్చేసింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.