
నిన్నమొన్నటివరకు కనిపించిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు కనబడుటలేదు. కొంతమంది పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చేస్తున్నారు. సినిమాలకు దూరంగా ఫ్యామిలీతో గడిపేస్తున్నారు. వరుస సినిమాతో హీరోయిన్స్ గా అలరించిన చాలా మంది భామలు ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. అలంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. ఆమె హీరోయిన్ గా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ పెళ్ళైన 16రోజులకే విడాకులు తీసుకుంది. పెళ్ళైన కొద్దీ రోజులకే భర్తతో మనస్పర్థలు కారణంగా విడాకులు తీసుకుంది. ఇప్పుడు తిరిగి సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. ఇంతకూ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?
ఎస్తర్ నోరోన్హా.. ఈ నటి గురించి చాలా మందికి తెలియక పోవచ్చు.. కానీ ఆమెను చూస్తే ఇట్టే గుర్తుపడతారు. ఈ అమ్మడు కన్నడ, తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. 2019 జనవరిలో గాయకుడు మరియు రాపర్ నోయెల్ సీన్‌ను వివాహం చేసుకుంది ఈ చిన్నది. కానీ ఈ ఇద్దరూ కేవలం 16రోజులకే విడిపోయారు. దర్శకుడు తేజ తెరకెక్కించిన 1000 అబద్దాలు (2013) లో నటించింది ఎస్తర్. సునీల్ సరసన భీమవరం బుల్లోడు చిత్రాల్లో నటించింది ఎస్తర్. అలాగే చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తుంది ఈ చిన్నది. మరోవైపు నోయల్ కూడా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
ఈ చిన్నదానికి తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆమె బోల్డ్ రోల్స్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. ఇటీవల టెనెంట్ అనే సినిమాలో కనిపించింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎస్తర్ మాట్లాడుతూ.. నాకు ఒంటరిగా ఉండాలని లేదు. నాకు వివాహం చేసుకోవాలని ఉంది. నాకు ఓ అందమైన జీవితం కావాలి. నాకు కరెక్ట్ లైఫ్ పార్టనర్ కావాలి. అలాగే. కానీ ఎలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలన్నదని పై క్లారిటీ లేదు. ఇప్పటికే ఒకసారి పెళ్లి చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. కాబట్టి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు అర్థం చేసుకునే వ్యక్తి కావాలి. షోకేస్ లాంటి మొగడు వద్దు అంటూ చెప్పుకొచ్చింది ఎస్తర్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.