ఒకేఒక్క సినిమా.. అది యావరేజ్..! దెబ్బకు కనిపించకుండా పోయిన హీరోయిన్.. ఇప్పుడు ఏం చేస్తుందంటే

హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఎంతో మంది హీరోయిన్స్ గా చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కొంతమంది ఒకటి రెండు సినిమాలతోనే ఇండస్ట్రీ నుంచి మాయం అవుతుంటారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ కూడా అంతే.. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. ఆతర్వాత కనిపించకుండా పోయింది.

ఒకేఒక్క సినిమా.. అది యావరేజ్..! దెబ్బకు కనిపించకుండా పోయిన హీరోయిన్.. ఇప్పుడు ఏం చేస్తుందంటే
Tollywood Actress

Updated on: Jul 12, 2025 | 12:10 PM

చాలా మంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలతోనే ప్రేక్షకులను మెప్పించి మాయం అయిపోతుంటారు. ఆతర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అవుతుంటారు. ఇంకొంతమంది సినిమాల్లో కనిపించపోయినా సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను కనువిందు చేస్తుంటారు. అలాగే పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా.. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ళ మనసు దోచేసింది. అందం అభినయంతో కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. అంతే కాదు కొన్ని వివాదాల్లోనూ ఇరుక్కుంది ఈ భామ. ఇంతకూ ఆ చిన్నది ఎవరో కనిపెట్టారా.?

ఇది కూడా చదవండి : మా అమ్మ వద్దన్నా అతన్ని పెళ్లి చేసుకొని తప్పు చేశా..! టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

సోషల్ మీడియాలో తన అందాలతో కుర్రకారును కవ్విస్తున్న ఆ చిన్నది ఎవరో కాదు.. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసి పాపులర్ అయ్యింది.. ఆమె పేరు సంయుక్త హెగ్డే . యంగ్ హీరో నిఖిల్ నటించిన కిరాక్ పార్టీ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది కన్నడ బ్యూటీ సంయుక్త హెగ్డే. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. అయితే ఈ సినిమాలో తన అందం, నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఈ సినిమా తర్వాత సంయుక్త తెలుగులో పెద్దగా నటించలేదు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Prabhas : ఆయన అలా అనగానే నాకు ఫస్ట్ టైమ్ కన్నీళ్లు వచ్చాయి.. జీవితంలో మర్చిపోలేనన్న ప్రభాస్

టాలీవుడ్​లో అవకాశాలు రాకపోయినప్పటికీ.. ఈ చిన్నది తమిళం, కన్నడలో మాత్రం వరుస ఛాన్సులు అందుకుంది.  అంతే కాదు కన్నడ బిగ్​బాస్​ లో కూడా పాల్గొంది ఈ అమ్మడు. బిగ్ బాస్ తర్వాత సంయుక్త హెగ్డే  ఫాలోయింగ్​ను మరింతగా పెంచుకుంది . సినిమాల ద్వారా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్​కు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు సంయుక్త. అంతే కాదు తన గ్లామరస్ ఫొటోలతో కుర్రాళ్ళ మతి పోగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది సంయుక్త. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇది కూడా చదవండి : అప్పుడు స్టార్ హీరోలతో చేశా.. ఇప్పుడు పట్టించుకోవడం లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ ఆవేదన

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.