బిగ్ బాస్‌లోకి నిఖిల్ మాజీ లవర్ !! సెలక్షన్స్‌తో గూగ్లీ విసురుతున్న బిగ్ బాస్
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు. ఈసారి మరిన్ని హంగులు, సర్ ప్రైజ్ లతో డబుల్ ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ రియాలిటీ షో ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకోగా త్వరలోనే తొమ్మిదో సీజన్ కూడా ప్రారంభం కానుంది. రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రోమో కూడా రిలీజైంది. ఇది కొత్త సీజన్ పై అంచనాలను అమాంతం పెంచేసింది.
మరోవైపు బిగ్ బాస్ లోకి వచ్చే కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ ఎక్స్ లవర్ సీజన్ 9 లోకి వెళుతున్నట్టు ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక మాటీవీలో ప్రసారమైన కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్, జాతి రత్నాలు వంటి టీవీషోల ద్వారా కొంత మంది కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ షోస్ లో జబర్దస్త్ ఇమ్మానుయేల్, బమ్ చిక్ బబ్లూ, రీతూ చౌదరి, జబర్దస్త్ ఐశ్వర్యతో పాటు మరో ఇద్దరు బుల్లితెర ఆర్టిస్టుల పేర్లు కంటెస్టెంట్స్ జాబితాలో ఉన్నారని బలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ల జాబితాలో మరో ప్రముఖ నటి పేరు కూడా ఉన్నట్లు సమాచారం. ఆమెనే నిఖిల్ ఎక్స్ లవర్ కావ్య శ్రీ. కావ్య ప్రస్తుతం ‘చిన్ని’ అనే సీరియల్‌లో నటిస్తోది. అయితే అనూహ్యంగా ఈ సీరియల్ లో ఆమె పాత్రను చంపేశారు. అంతేకాదు కొత్త నటిని కూడా పరిచయం చేశారు. దీంతో కచ్చితంగా కావ్య ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతుందన్న వార్తలకు బలం చేకూరింది. మరీ ముఖ్యంగా ఆమె సడెన్‌గా సీరియల్‌ను వదిలేయడం, బిగ్ బాస్ ఆఫర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని చాలా మంది భావిస్తున్నారు.ఇక ఈ విషయం పక్కకు పెడితే.. నిఖిల్ కారణంగా గత బిగ్ బాస్ సీజన్ టైంలో కావ్య శ్రీ విపరీతంగా వైరల్ అయింది. ట్రోల్ కూడా అయింది. దీంతో అప్పుడే నెక్ట్స్ సీజన్‌లో ఈ బ్యూటీకి బెర్త్ పక్కా అనే టాక్ వచ్చింది. అది కాస్తా ఇప్పుడు నిజం అయ్యేలా కనిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఊ.. అన్న మాంచి ఆటగాడే..! ఐకాన్ స్టార్‌పై సరదా ట్రోలింగ్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

