ఊ.. అన్న మాంచి ఆటగాడే..! ఐకాన్ స్టార్‌పై సరదా ట్రోలింగ్
ఈ మధ్య అట్లీ సినిమా హ్యాపెనింగ్స్‌తోనే నెట్టింట ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ ఈ సారి.. మాత్రం సరదా ట్రోలింగ్‌తో అందర్నీ నవ్విస్తూ నెట్టింట వైలర్ అవుతున్నాడు. 'ఊ.. అన్న మాంచి ఆటగాడే' అనే కామెంట్‌ను కూడా ఫన్నీగా వచ్చేలా చేసుకుంటున్నాడు మన ఐకాన్ స్టార్. ఇక.. కొన్ని రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ అవార్డ్స్ వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్‌గా అవార్డు అందుకుని, స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు.
ఈ క్రమలోనే అదే ఈవెంట్లో.. బన్నీ పక్కనే కూర్చున్న బాలయ్య… స్టేజ్‌పై ఓ క్రేజీ పాటకు పర్ఫార్మెన్స్ జరుగుతున్న టైంలో.. ‘పదా మనం కూడా వెళ్లి డ్యాన్స్ చేద్దాం’ అంటూ బన్నీ చేయి పట్టుకుని లాగబోయాడు. దీంతో అవాక్కైన బన్నీ..తన చేతిని వెనక్కి లాగేసుకుని, నవ్వుతూనే బాలయ్యకు నో చెప్పాడు. అయితే అప్పుడు ఈ వీడియో అంతగా వైరల్ కాలేదు. ఇక, రీసెంట్‌గా టాంపాలో జరిగిన నాట్స్ ఉత్సవాల్లో.. సేమ్ అదే సీన్ రిపీటైంది. అయితే, ఇక్కడి ఈవెంట్‌లో బాలయ్య బదులు బన్నీ పక్కన శ్రీలీల కూర్చొంది. అదే టైంలో స్టేజ్‌పై మెగాస్టార్ ‘అబ్బనీ తియ్యనీ సాంగ్ ప్లే అవుతోంది. అంతే.. ఆ సాంగ్ విన్న ఒక్కసారిగా ఎగ్జైట్ అయి.. ‘పద పైకెళ్లి డ్యాన్స్ చేద్దాం’ అంటూ శ్రీలీలను అడిగేశాడు. దీంతో, ఒక్కసారిగా షాకైన శ్రీలీల.. నవ్వుతూనే తన కళ్లను పెద్దగా చేసి.. నో చెప్పేసింది. అయితే ఇందుకు సంబంధించిన అప్పటి నుంచి నెట్టింట తెగ వైరల్ అవుతూనే ఉంది. అయితే ఈ వీడియోలో అల్లు అర్జున్ క్రేజీనెస్‌ను పట్టేసిన కొంత మంది నెటిజన్లు… గద్దర్ అవార్డ్స్‌లో బాలయ్య బన్నీ వీడియోతో లింక్ చేసి నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. బాలయ్య డాన్స్ చేద్దామంటే వద్దన్న బన్నీ, శ్రీలీలతో మాత్రం డాన్స్ చేయడానికి రెడీ అయ్యాడంటూ సరదాగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. రూ.5 కోట్లకు నోటీస్ !!
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. అట్లనే.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్.. ఎప్పటి నుంచి అంటే
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

