ఏం మారలేదు భయ్యా..!! ఒకప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్..! 19ఏళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు ఇలా..
హీరోయిన్స్ మాత్రమే కాదు చాలా మంది సీనియర్ హీరోలు కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు. కొంతమంది విలన్స్ గా మారి ఆకట్టుకుంటుంటే మరికొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తాజాగా ఓ సీనియర్ హీరో 19ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు, హీరోయిన్స్ గా రాణించి.. ఆతర్వాత కనిపించకుండా మాయం అయ్యారు. చాలా మంది హీరోలు ఇప్పుడు విలన్స్ గా మారి సినిమాలు చేస్తున్నారు. మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా చేసి మెప్పిస్తున్నారు. అలాగే హీరోయిన్స్ కూడా ఒకప్పుడు రాణించి.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి అమ్మ, అక్క, వదిన పాత్రల్లో మెప్పిస్తున్నారు. కాగా ఓ హీరో ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. చాలా కాలం తర్వాత తిరిగి సినిమాలోకి అడుగుపెడుతున్నారు. ఆయన ఒకానొక సమయంలో స్టార్ హీరో. అమ్మాయిల డ్రీమ్ బాయ్. కానీ ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యాడు. కట్ చేస్తే 19 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. మధ్యలో ఓ సినిమా చేసినా అది వచ్చి పోయిన విషయం కూడా చాలా మందికి తెలియదు. ఇంతకూ ఆయన ఎవరంటే..
ఇది కూడా చదవండి :Srihari: వాడు నా అయ్య..! శ్రీహరి నాన్న అని పిలిచే ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా.?
1997లో వచ్చిన పెళ్లి సినిమాతో పాపులర్ అయ్యాడు వడ్డే నవీన్. ఒకప్పుడు టాప్ హీరోలలో వడ్డే నవీన్ ఒకరు. వరుసగా సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో ఆయన ప్రధాన పాత్రలో నటించిన పెళ్లి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ చిత్రానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఇందులోని పాటల గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట ఈ సినిమా పాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమాతో ఒక్కసారిగా సెన్సెషన్ అయిన వడ్డే నవీన్.. ఆ తర్వాత మనసిచ్చి చూడు, నా హృదయంలో నిదురించే చెలి, ప్రేమించే మనసు, చాలా బాగుంది, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు.
ఇది కూడా చదవండి : ఏంటీ..! మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నది ఇప్పుడు స్టార్ హీరోయినా.! అదికూడా తెలుగమ్మాయి
అయితే వరుస హిట్స్ అందుకుంటున్న సమయంలోనే కొన్ని ప్లాప్స్ సైతం వచ్చి చేరాయి. ఆ తర్వాత సినిమాల ఎంపికలో చిన్న చిన్న పోరాపాట్లతో నెమ్మదిగా వడ్డే నవీన్ క్రేజ్ తగ్గిపోయింది. ఆ తర్వాత మెల్లిగా సినిమాలకు దూరమయ్యారు. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు వడ్డే నవీన్. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండడం లేదు. దాదాపు 19ఏళ్ల తర్వాత ఇప్పుడు వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. మొన్న మధ్య బొద్దుగా కనిపించిన నవీన్.. ఇప్పుడు స్లిమ్ గా మారిపోయాడు. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. కాగా ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నవీన్. ఈ సినిమాలో ఆయన పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించనున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నటించడమే కాదు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు నవీన్. రాశీ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రఘు బాబు, బాబా మాస్టర్, శిల్పా తులస్కర్, దేవి ప్రసాద్, శివ నారాయణ, ప్రమోదిని, గాయత్రి భార్గవి, రేఖా నిరోష ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
ఇది కూడా చదవండి : ఏం సినిమా రా అయ్యా..! థియేటర్స్‌లో డిజాస్టర్..11ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న సినిమా..
From silver screen memories to a bold new avatar ✨#VaddeNaveen garu is back — ruling hearts & the screen again, in khaki style!👮🏻♂️
Proudly presenting the #FirstLook of @vaddecreations Production No 1- #TransferTrimurthulu ❤️🔥@vaddenaveen @RashiReal_ @MeeKamalTeja @vamsikaka pic.twitter.com/J0ESA6X2Tm
— vadde creations (@vaddecreations) August 9, 2025
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి








