Shaitan:సైతాన్ సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఎవరో మీకు తెలుసా..? ఆ అమ్మడు ఎవరంటే
మంచి మంచి కంటెంట్స్ తో కొత్త కొత్త దర్శకులు, నటీనటులు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఇక క్రైమ్ ఇంటెన్స్ కథలకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఇదే తరహా కథలు ఓటీటీలలో దర్శనమిస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో చిన్న సినిమా.. పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ ఉంటే చాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. అలాగే ఓటీటీ సంస్థలు అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక సినిమాలు వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మంచి మంచి కంటెంట్స్ తో కొత్త కొత్త దర్శకులు, నటీనటులు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఇక క్రైమ్ ఇంటెన్స్ కథలకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఇదే తరహా కథలు ఓటీటీలలో దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న దర్శకుడు మహి వి రాఘవ్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సైతాన్ అనే క్రైం స్టోరీతో అలరించడానికి రెడీ అయ్యారు ఈ డైరెక్టర్.
రీసెంట్ గా సైతాన్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ సిరీస్ ట్రైలర్ చూస్తే ఒళ్ళు గగ్గుర్లు పొడుస్తుంది. ఈ ట్రైలర్ లో వైలెన్స్, బోల్డ్ సీన్స్, బూతులతో నింపేశారు. ఈ ట్రైలర్ చూస్తే దండుపాళ్యం సినిమా గుర్తొస్తుంది. ఇక ఈ ట్రైలర్ లో కనిపించిన అమ్మడు గురించి నెటిజన్స్ ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఇంతకు ఆ అమ్మడు ఎవరో తెలుసా..? ఆమె పేరు దేవియాని శర్మ. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ సినిమాలో ఆకాష్ ఫ్రెండ్ గా నటించింది ఈ భామ. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. అలాగే సేవ్ ది టైగర్స్ లోనూ కనిపించి మెప్పించింది దేవియాని శర్మ. ఇక సైతాన్ లో బోల్డ్ సీన్స్ లో నటించి మెప్పించింది. ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫొటోలతో అభిమానులను అలరిస్తోంది దేవియాని శర్మ.
View this post on Instagram