
నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే చాలు థియేటర్స్ దద్దరిల్లిపోవాల్సిందే.. బాలయ్య స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అభిమానులకు పూనకాలే.. బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను , బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా ఇది. గతంలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో అక్కడ 2 సినిమా రానుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ఈ వీడియో సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. అలాగే మరో రెండు మూడు సినిమాలను కూడా లైనప్ చేశారు.
వీటితో పాటు వెంకటేష్, బాలకృష్ణ కాంబినేషన్ లో ఓ భారీ మల్టీ స్టారర్ మూవీ కూడా రానుంది. ఇదిలా ఉంటే బాలకృష్ణ ఓ ఇద్దరు హీరోయిన్స్ చాలా స్పెషల్.. బాలకృష్ణకు లవర్స్ గా భార్యగా నటించిన ఈ ఇద్దరు హీరోయిన్స్ ఎవరో తెలుసా.? బాలకృష్ణ ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అలాగే ఎంతో మంది హీరోయిన్స్ తో నటించారు. వారిలో టబు ఒకరు. బాలయ్యకు జోడీగా ఈ ముద్దుగుమ్మ చెన్నకేశవరెడ్డి సినిమాలో నటించింది. ఈ సినిమాలో బాలకృష్ణ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు. చెన్నకేశవరెడ్డి సినిమాలో టబు బాలకృష్ణ తల్లిగా , భార్యగా నటించారు.
అలాగే గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు. ఈ సినిమాలో కూడా బాలయ్య తండ్రీకొడుకులు గా కనిపించి మెప్పించారు. ఈ సినిమాలో హనీరోజ్ కూడా బాలయ్యకు తల్లిగా, భార్యగా నటించి మెప్పించారు. ఈ అమ్మడు వీరసింహారెడ్డి సినిమా తర్వాత హనీరోజ్ మరో తెలుగు సినిమాలో నటించలేదు. ఇలా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు బాలయ్యకు లవర్ గా, భార్యగా నటించి మెప్పించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.