Geetha Govindam: సూపర్ హిట్ గీతగోవిందం సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమె చేసుంటేనా..
యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ సక్సెస్ సాధించడంతో పాటు విజయ్ కు రష్మికాకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. తెలుగులో రష్మిక నటించిన రెండో సినిమా ఇది. గీతగోవిందం సినిమాలో రష్మిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

విజయ్ దేవరకొండ కెరీరీలో బిగెస్ట్ హిట్స్ గా నిలిచిన సినిమాల్లో గీతగోవిందం సినిమా ఒకటి. విజయ్, రష్మిక మందన్న కలిసి నటించిన ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ సక్సెస్ సాధించడంతో పాటు విజయ్ కు రష్మికాకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. తెలుగులో రష్మిక నటించిన రెండో సినిమా ఇది. గీతగోవిందం సినిమాలో రష్మిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. యాటిట్యూడ్ ఉన్న అమ్మాయి పాత్రలో ఆకట్టుకుంది ఈ చిన్నది. అయితే రష్మిక కంటే ముందు ఈ సినిమాలో మరో హీరోయిన్ ను ఎంపిక చేశాడట దర్శకుడు పరశురామ్. నిజం చెప్పాలంటే గీతగోవిందం సినిమా తర్వాత నుంచే రష్మిక రేంజ్ మారిపోయింది. అయితే గీతగోవిందం లాంటి సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరంటే..
ఈ సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకున్న ముద్దుగుమ్మ మరెవరో కాదు అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. దర్శకుడు పరశురామ్ ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా లావణ్యను హీరోయిన్ గా అనుకున్నారట. అయితే ఈ మూవీలో లిప్ లాక్ సన్నివేశం ఉండటంతో లావణ్య నో చెప్పిందని తెలుస్తోంది.
గీతగోవిందం సినిమా లిప్ లాక్ సీన్ తో టర్న్ అవుతుంది. అయితే అలాంటి సీన్ లో నటించడం ఇష్టం లేక సినిమాను మిస్ చేసుకుందట. ఇక పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా కంటే ముందు వచ్చిన శ్రీరస్తు శుభమస్తు అనే సినిమాలో లావణ్య హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ అమ్మడు త్వరలోనే మెగా ఫ్యామిలీకి కోడలుగా వెళ్లనుంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ రీసెంట్ గా జరిగిన విషయం తెలిసిందే.
Lavanya Tripathi
