
మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. సౌత్ తోపాటు.. నార్త్ లోనూ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు.. కన్నడం, తమిళ్, హిందీ ఇండస్ట్రీలో ప్రాదాన్యత ఉన్న పాత్రలలో నటించి ప్రశంసలు అందుకుంది. తమన్నాకు ఉన్న ఫాలోయింగ్ కూడా ఎక్కువే. కథానాయికగా ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్లు పూర్తిచేసుకుంది మిల్కీబ్యూటీ. ఇన్నేళ్ల కెరీర్ లో ఏకంగా 50 సినిమాలకు పైగా చేసింది. హీరోయిన్ గా కాకుండా.. స్పెషల్ సాంగ్స్ తోనూ సందడి చేసింది. అలాగే మ్యూజిక్ ఆల్బంలోనూ నటించి మెప్పించింది. అటు వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా మెరిసింది. ఇక ఇప్పుడు డిజిటల్ రంగంలోనూ రాణిస్తోంది.
అయితే ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన 15 ఏళ్ల వయసులోనే సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేసింది. పదవ తరగతి చదివే సమయంలోనే వెండితెరపై సందడి చేసింది. 2005 సంవత్సరంలో చాంద్ సా రోషన్ చెహరా అనే సినిమాలో నటించి ప్రశంసలు అందుకుంది. ఇక అదే ఏడాది మంచు మనోజ్ నటించిన శ్రీ చిత్రంలో నటించింది. ఈ సినిమా ఆశించినంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ చిత్రంతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది తమన్నా.
ఈ సినిమా తర్వాత మిల్కీబ్యూటీ క్రేజ్ మారిపోయింది. దక్షిణాదిలో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ బాహుబలి చిత్రంలో ఆవంతిక పాత్రలో తమన్నా నటనకు సినీ విమర్శకులు ప్రశంసలు కురిపించారు. చివరగా బబ్లీ బౌన్సర్ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన తమన్నా.. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ మూవీలోనూ కనిపించనుంది. 15 ఏళ్ల వయసులో కథానాయికగా అరంగేట్రం చేసి.. హీరోయిన్ గా 17 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నా.. ఇప్పటికీ మిల్కీబ్యూటీ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.