Subha Sankalpam: కమల్ హాసన్‌తో కలిసి నటించి మెప్పించిన ఈ నటి గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందో.? ఏం చేస్తుందో తెలుసా.?
పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.. కమల్ హాసన్ నటించిన శుభసంకల్పం సినిమాలో నటించిన ఈ హీరోయిన్ అప్పట్లో కుర్రకారును ఆకట్టుకుంది.
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ పరిచయమై ప్రేక్షకుల మన్నలు అందుకున్నారు. ఇక టాలీవుడ్ కు కూడా చాలా మంది పరిచయం అయ్యారు. వీరిలో చాలా మంది హీరోయిన్స్ ఎక్కువ కాలం రాణించలేకపోయారు. అయితే చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇంకొంత మంది సినిమాలనుంచి సీరియల్స్ కు షిఫ్ట్ అయ్యారు. మరి కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.. కమల్ హాసన్ నటించిన శుభసంకల్పం సినిమాలో నటించిన ఈ హీరోయిన్ అప్పట్లో కుర్రకారును ఆకట్టుకుంది. ఆమె పేరు ప్రియా రామన్. తమిళ్ లోని వల్లి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ప్రియా రామన్.
ఇక తెలుగులో మా ఊరి మారాజు అనే సినిమా ద్వారా పరిచయం అయ్యారు. ఇక నాయకుడు, శుభసంకల్పం అనే సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దొర బాబు,శ్రీవారి ప్రియురాలు,శ్రీ కృష్ణార్జున విజయం సినిమాల్లో నటించారు. ఇక చాలా కాలం తర్వాత శర్వానంద్ నటించిన పడి పడి లేచె మనసు సినిమాలో హీరో తల్లిగా కనిపించారు.
ప్రియా రామన్ లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారని తెలుసుకోవడానికి గూగుల్ ను గాలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రియా రామన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. శం పుడుచు అనే సినిమా షూటింగ్ సమయంలో తమిళనటుడు రంజిత్‌ని ప్రేమించిన ఆమె ఆయన్ను 1999లో వివాహం చేసుకున్నారు.