సీనియర్ నటుడు పీఎల్ నారాయణ మేనకోడలు.. తెలుగులో స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.? ఆమె ఎవరంటే..
తెలుగు, తమిళ భాషల్లో సుమారు 300కు పైగా చిత్రాల్లో నటించి.. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి.. తనదైన శైలి నటనతో ఆ పాత్రలకు..
తెలుగు, తమిళ భాషల్లో సుమారు 300కు పైగా చిత్రాల్లో నటించి.. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి.. తనదైన శైలి నటనతో ఆ పాత్రలకు ప్రాణం పోయడం నటుడు పీఎల్ నారాయణకే సొంతం. ఈ పేరు చెప్పగానే మీకు ఆయనెవరో ఠక్కున గుర్తురాకపోవచ్చు. ‘రుద్రవీణ’, ‘మయూరీ’ సినిమాల్లో హీరోయిన్ తండ్రి పాత్రల్లో నటించారంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. ఇండస్ట్రీలోకి వచ్చి.. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. జాతీయ స్థాయిలో అవార్డును సైతం సొంతం చేసుకున్నారు పీఎల్ నారాయణ.
పీఎల్ నారాయణ మలయాళ కుటుంబానికి చెందిన వ్యక్తే అయినప్పటికీ.. ఆయన పుట్టి.. పెరిగింది గుంటూరు బాపట్ల. ఆయన చదువుకునే రోజుల్లోనే కుక్క అనే నాటకం రాశారు. ఈ నాటకానికి ఏకంగా జాతీయ స్థాయిలో అవార్డు రావడమే కాదు.. పీఎల్ నారాయణకు సినిమా అవకాశాలను సైతం తెచ్చిపెట్టింది. అనంతరం తెలుగు, తమిళ భాషల్లో వరుసపెట్టి సినిమాలు చేసి.. మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక నారాయణ వారసురాలు ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా కొన్నేళ్లు పాటు టాలీవుడ్‌ని ఏలింది. ఇంతకీ ఆమెవరో కాదు.. ఊహ. మీరు విన్నది నిజమే. ఆమె నారాయణకు స్వయానా మేనకోడలు. ఊహ అసలు పేరు శివరంజని. తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందే తమిళంలో సుమారు 20 సినిమాల్లో నటించింది ఊహ. ఆ తర్వాత టాలీవుడ్‌లో నటిగా పరిచయమై.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తన కెరీర్‌లో హీరో శ్రీకాంత్‌తోనే ఎక్కువ చిత్రాలు చేసింది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఇద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. ఊహ తొలి, చివరి సినిమాలు శ్రీకాంత్‌తో చేయడం విశేషం. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కాగా, శ్రీకాంత్, ఊహల పెద్ద కుమారుడు రోషన్ టాలీవుడ్‌లో హీరోగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే.