
సచిన్ జోషి.. తెలుగులో తక్కువ సమయంలోనే ఫేమస్ అయిన హీరో. కానీ అంతే టైంలో ఇండస్ట్రీ నుంచి దూరమయ్యారు. ఒకటి రెండు చిత్రాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. హీరోగా మాత్రం సక్సెస్ కాలేకపోయారు. సినిమా ప్రపంచంలో రాణించాలంటే ప్రతిభతోపాటు అవగింజంత అదృష్టం కూడా ఉండాలి. వేల కోట్లకు అధిపతి అయినప్పటికీ నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేశాడు. కానీ అతడు చేసిన ఒక్క సినిమా కూడా హిట్టు కాలేదు. తెలుగు సుపరిచితమైన సచిన్ జోషి.. ఒకప్పుడు తనదైన నటనతో అలరించారు. 2002లో మౌనమేలనోయి సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు.
ఇవి కూడా చదవండి : Cinema: ఇది సక్సెస్ అంటే.. రూ.4 కోట్లు పెడితే.. రూ.121 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను శాసించిన సినిమా..
ఆ తర్వాత నిన్ను చూడకుండా నేనుండలేను, ఓరెయ్ పండు వంటి చిత్రాలతో అడియన్స్ ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమాలు సైతం అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో సినిమాలకు దూరంగా ఉండిపోయారు. తెలుగు, హిందీలో పలు చిత్రాల్లో నటించారు. దాదాపు 9 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. ఆషికీ 2 తెలుగు రీమేక్ నీ జతగా నేనుండాలి మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ సినిమా సైతం డిజాస్టర్ గా మారింది. ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్టుగానూ రెండు మూడు సినిమలు చేశాడు. అయినా సక్సెస్ కలిసిరాలేదు. దీంతో పూర్తిగా ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యారు.
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకరు తోపు డైరెక్టర్.. ఇంకొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ ఇద్దరి టాలెంట్‌కు ప్రపంచమే జై కొట్టింది..
ఇదిలా ఉంటే.. సచిన్ జోషి భార్య సైతం హిందీ, తెలుగులో తోపు హీరోయిన్ అన్న సంగతి మీకు తెలుసా.. ? నిజానికి సచిన్ జోషి సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్. వేల కోట్లకు అధిపతి. కానీ నటుడిగా సక్సెస్ కాలేకపోయారు. ఇక సచిన్ జోషి భార్య పేరు ఊర్వశీ శర్మ. 2008లో త్రీ సినిమాతో కథానాయికగా మెప్పించింది. ఈ మూవీ డిజాస్టర్ కావడంతో తెలుగులో మరో సినిమా చేయలేదు. హిందీలో పలు సినిమాల్లో నటించింది. సచిన్ జోషి, ఊర్వశి దంపతులకు బాబు, పాప ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరు సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపారరంగంలో రాణిస్తున్నారు.
Urvashi Sharma
ఇవి కూడా చదవండి : Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..
ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. క్రేజీ ఫోటోలతో గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టరా.. ?