Tollywood: తండ్రి కమెడియన్.. కొడుకు IAS ఆఫీసర్.. ఈ నటుడి కొడుకు గురించి తెలిస్తే షాకే..
సినీరంగంలో తండ్రి తోపు కమెడియన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనదైన కామెడీ డైలాగ్స్.. నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. కానీ అతడి కొడుకు మాత్రం తండ్రిలాగా సినిమాల్లోకి కాకుండా సరికొత్త దారిని ఎంచుకున్నాడు. యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి IAS ఆఫీసర్ అయ్యాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ?

సాధారణంగా ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడని.. పోలీస్ ఆఫీసర్ కొడుకు పోలీస్ అవుతాడని… రాజకీయ నాయకుడి కొడుకు రాజకీయ నాయకుడే అవుతాడని అంటారు. ఇక ఇండస్ట్రీలో సైతం ఇదే ఫార్ములా నడుస్తుంటుంది. నెపోటిజం అనే టాక్ కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో వినిపిస్తుంటుంది. స్టార్ హీరోహీరోయిన్స్ వారసులు సినీరంగంలో సత్తా చాటుతుంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నటుడి తనయుడు మాత్రం వీటన్నింటికి ప్రత్యేకం. ఇండస్ట్రీలో తండ్రి తోపు కమెడియన్. కానీ కొడుకు మాత్రం నటుడు కాకుండా IAS ఆఫీసర్ అయ్యాడు. అతడు మరెవరో కాదు.. తమిళ నటుడు చిన్ని జయంత్ కుమారుడు. AIR తో UPSC పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అతని తండ్రి సినిమా పరిశ్రమలో ఫేమస్ యాక్టర్. రజినీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించాడు. కానీ కొడుకు నటనకు భిన్నమైన వృత్తిని ఎంచుకున్నాడు. అతని పేరు శ్రుతంజయ్ నారాయణన్.
2011 నుండి 2015 వరకు శ్రుతంజయ్ నారాయణన్ గిండిలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి బ్యాచిలర్ డిగ్రీ, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సైన్స్, కార్టోగ్రఫీని పూర్తి చేశారు. 2015లో అశోక విశ్వవిద్యాలయంలో చేరి మాస్టర్స్ డిగ్రీ, లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్/లిబరల్ స్టడీస్‌ను అభ్యసించాడు. ఆ తర్వాత ఆన్‌లైన్ ప్రసాద్‌లో మార్కెటింగ్ ఇంటర్న్‌గా పనిచేశాడు. అలాగే అయమారా ఈవెంట్‌లను సహ-స్థాపించాడు. NASSCOM ఫౌండేషన్‌లో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేశాడు. శ్రుతంజయ్ తన UPSC ప్రయాణాన్ని 2018 లో ప్రారంభించాడు. కానీ అతడి మొదటి ప్రయత్నం విఫలమయ్యింది. ఆ తర్వాత 2019లో మరోసారి యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి 75వ ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) ను సాధించాడు. అతను తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు అదనపు కలెక్టర్ బాధ్యతలు తీసుకున్నాడు.
చిన్ని జయంత్ అనేక దక్షిణ భారత చిత్రాలలో నటించారు. తమిళ సినిమా దర్శకుడిగా కూడా అడుగుపెట్టారు. ఆయన కొన్ని తెలుగు, నటించారు కానీ 1980లలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి హాస్య పాత్రలు పోషించి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఆయన తమిళనాడు ఈ గవర్నెన్స్ ఏజెన్సీలో జాయింట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.

Chinni Jayanth Son
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..




