
2025 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో పెద్ద స్టార్లు ఎవరూ లేరు. కానీ ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అలాగే ఇటీవల థియేటర్లలో సంచలన విజయం సాధించిన ‘ఛావా’, ‘హౌస్ ఫుల్ 5’ వంటి పెద్ద సినిమాల రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఎలాంటి అంచనాలు, హడావిడి, ప్రమోషన్స్, ఆర్భాటాలు లేకుండా సైలెంట్ గా జనాల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సినిమా పేరు ‘సూ ఫ్రమ్ సూ’. 2025 సంవత్సరంలో బంపర్ వసూళ్లతో అత్యంత కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలలో ఇది ఒకటి. అయితే ఇది తెలుగు సినిమా కాదండి.. కన్నడ మూవీ. ప్రస్తుతం IMDbలో 8.6 రేటింగ్‌ను కలిగి ఉంది.
ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?
జె.పి. తుమినాద్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించారు. అలాగే ఇందులో హీరోగా కూడా నటించారు. ప్రముఖ కన్నడ నటుడు రాజ్ బి. శెట్టి నిర్మాతగా వ్యవహరించారు. కర్ణాటకలోని ఒక ప్రశాంతమైన తీరప్రాంత గ్రామంలో సాగే కథ ఇది. గ్రామంలో అశోక్ అనే బాలుడికి సులోచన అనే దెయ్యం పట్టిందని గ్రామస్తులు నమ్ముతారు. ఆద్యంతం కామెడీతో సాగే ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇందులో షానిల్ గౌతమ్, సంధ్య అరకెరె, ప్రకాష్ తుమినాద్ కీలకపాత్రలు పోషించారు. వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు తుమినాద్.
ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..
ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో దూసుకుపోతుంది. కేవలం 21 రోజుల్లోనే భారతదేశంలో ఏకంగా రూ.70.29 కోట్లు రాబట్టింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.90 కోట్లు రాబట్టింది. కానీ సినిమాను కేవలం రూ.6 కోట్లతో నిర్మించారు. ఇప్పటివరకు ఆ మూవీ ఖర్చు కంటే 1400 శాతం ఎక్కువ లాభాలను రాబట్టింది.
ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..
ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..