
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులుగా వెలుగు వెలుగుతున్న తారలు చాలా మంది ఉన్నారు. కానీ సినిమాల్లోకి రాకముందు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. అవమానాలు, విమర్శలు దాటుకుని వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ప్రస్తుతం వెండితెరపై తన నటనతో అలరిస్తున్న చాలా మంది నటుల జీవితాల్లో చీకటి కోణాలు దాగి ఉన్నాయి. ఇటీవల కొందరు నటులు తమ జీవితంలో పడిన కష్టాల గురించి ఇంటర్వ్యూలలో బయటపెట్టారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కమెడియన్.. లైఫ్ లో ఎదుర్కొన్న సవాళ్లను, కష్టాలను గురించి చెప్పుకొచ్చారు. అతడు మరెవరో కాదు తాగుబోతు రమేష్. తెలుగు సినిమాల్లో తాగుబోతు పాత్రలలో నటిస్తూ తనదైన కామెడీ పంచులతో ప్రేక్షకులను అలరించాడు. తక్కువ సమయంలోనే కమెడియన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇవి కూడా చదవండి : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి.. సినిమాలు వదిలేసి గూగుల్ కంపెనీ సీఈఓగా.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ?
తెలుగులో పలు చిత్రాల్లో నటించిన రమేష్.. కొన్నాళ్ల క్రితం బుల్లితెరపై సక్సెస్ అయిన జబర్దస్త్ షోలోకి అడుగుపెట్టాడు. హాస్య నటుడిగా తెరంగేట్రం చేసిన రమేష్.. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. అయితే అతడు ఎక్కువగా తాగుబోతు పాత్రలతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగులో అతడు పాపులర్ అయ్యాడు.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. కానీ నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అదే సమయంలో జబర్దస్త్ షోలోకి అడుగుపెట్టి మరోసారి తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొన్న రమేష్.. తన కెరీర్ లో ఎదురైన ఇబ్బందుల గురించి మాట్లాడారు.
ఇవి కూడా చదవండి : Actor : 26 అనాథాశ్రమాలు.. 46 ఉచిత పాఠశాలలు.. రియల్ లైఫ్ హీరో.. సమాజం కోసం జీవితం ఇచ్చిన హీరో..
నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని సినీరంగంలోకి అడుగుపెట్టానని.. కానీ అవకాశాలు అందుకోవడం అంత సులభంగా జరిగే పని కాదని అన్నారు. ఎన్నో కష్టాలు.. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయని అన్నారు. బస్ కు వెళ్తే ఐదు రూపాయాలు ఖర్చు అవుతుందని.. అందుకే 5 రూపాయాలు జేబులో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్లిన రోజులు ఉన్నాయని గుర్తు చేసుకున్నాడు. అవకాశాల కోసం పగలంతా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ.. రాత్రిళ్లు వాచ్ మెన్ జాబ్ చేశానని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నటుడిగా గుర్తింపు వచ్చేవరకు తాను బతకడానికి ఎన్నో పనులు చేశానని.. జేసీబీ డ్రైవర్ గా కూడా పనిచేశానని అన్నారు. తన నటనతో ప్రేక్షకులను నవ్వించిన రమేష్ జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయని తెలిసి అక్కడున్నవారంతా ఎమోషనల్ అయ్యారు.
Thagubothu Ramesh
ఇవి కూడా చదవండి : Actress: 150కి పైగా సీరియల్స్.. ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలిసే భిక్షాటన చేస్తూ ..