
పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగులో తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ సక్సెస్ మాత్రం కాలేదు. తెలుగులో దాదాపు 8 సినిమాల్లో నటించింది. కానీ అందులో కేవలం రెండు మాత్రమే హిట్టయ్యాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. అంతేకాదండి.. ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మకు చెల్లెలు అవుతుంది. అలాగే టీమిండియా క్రికెటర్ మరదలు సైతం. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? కెరీర్ మొదట్లో పద్దతిగా ఢీగ్లామర్ పాత్రలలో కనిపించింది. కానీ నటిగా మంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం నెట్టింట గ్లామర్ లుక్ లో హాట్ హాట్ ఫోజులతో కవ్విస్తుంది.
ఇవి కూడా చదవండి : Cinema: 70 లక్షల బడ్జెట్.. 75 కోట్ల కలెక్షన్స్.. కట్ చేస్తే.. 12 సంవత్సరాలు థియేటర్లలో దుమ్మురేపిన సినిమా..
ఆమె నటించిన ఫస్ట్ మూవీ సూపర్ హిట్టయ్యింది. ఆ తర్వాత తెలుగులో విభిన్న కథలను ఎంచుకుంటూ నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు పేరు రుహానీ శర్మ. తెలుగులో చిలసౌ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫస్ట్ మూవీతోనే యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ కథానాయికగా సరైన హిట్టు మాత్రం అందుకోలేకపోయింది.
ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. బుల్లిగౌనులో సీరియల్ బ్యూటీ రచ్చ.. గ్లామర్ ఫోజులతో గత్తరలేపుతున్న వయ్యారి..
ప్రస్తుతం తెలుగులో ఆడపాదడపా చిత్రాలలో నటిస్తుంది.హిట్, డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు, హర్, సైంధవ్, ఆపరేషన్ వాలెంటైన్, శ్రీరంగనీతులు వంటి చిత్రాలతో అలరించింది. ఇందులో చి.ల.సౌ, హిట్ సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉన్న ఈ అమ్మడు.. జీన్స్ , టీషర్ట్ లో సెల్ఫీ ఫోజులతో మెంటలెక్కిస్తుంది.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్బాస్ సీజన్ 9లోకి ప్రభాస్ హీరోయిన్.. సెన్సేషనల్ ఫోక్ సింగర్.. ఫుల్ లిస్ట్ ఇదే..
ఇవి కూడా చదవండి : Tollywood : అక్కినేని మూడు తరాలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్.. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్యతో సినిమాలు.. ఎవరంటే..