ఇద్దరు భర్తలతో విడాకులు.. 39 ఏళ్ల వయసులో 3వ పెళ్లి.. ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్ ఆమె
సినిమా ఇండస్ట్రీలో విడాకులు , పెళ్లిళ్లు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. ఇండస్ట్రీలో ఈ మధ్య విడాకుల వార్తలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. స్టార్ హీరోల నుంచి దర్శకుల వరకు చాలా మంది విడాకులు తీసుకుంటూ ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నారు. సమంత, నాగ చైతన్య దగ్గర నుంచి ఏఆర్ రెహమాన్ వరకు విడాకులు అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చారు.

సినీ పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్ల గురించి.. నిత్యం వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కొంతమంది ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ప్రేమ దగ్గరే ఆగిపోతున్నారు. ఇంకొంతమంది పెళ్లి మాట ఎత్తకుండా సైలెంట్ గా ఉంటున్నారు. ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో బ్రేకప్స్, విడాకులు చాలా కామన్ అయిపోతున్నాయి. ఏళ్లతరబడి ప్రేమించుకున్నవాళ్ళు.. అలాగే వివాహం చేసుకొని చాలా కాలం కలిసున్నా వారు కూడా విడాకులు తీసుకొని అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే సమంత నాగ చైతన్య దగ్గర నుంచి.. జీవి ప్రకాష్, ధనుష్, మొన్నామధ్య జయం రవి విడాకులు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. మరోవైపు కొంతమంది ఇద్దరు ముగ్గురిని పెళ్లాడిన వారు కూడా ఉన్నారు. అయితే తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ కు సంబందించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది.
ఒకటే ఫ్యామిలీ.. ఏడుగురు హీరోయిన్స్.. అందరూ తోపులే.. ఈ అందాల భామలు ఈవారంటే
ఆ టాలీవుడ్ హీరోయిన్ కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. నిజానికి రెండో పెళ్లి చేసుకుంటేనే పెద్ద వార్త అలాంటిది ఆ హీరోయిన్ ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఆమె ఎవరో కాదు ఆమె సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్. ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు రాధికా. అలాగే మెగాస్టార్ చిరంజీవి రాధికా కాంబినేషన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ చాలా సినిమాలు చేశారు రాధికా. సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ నటించి ఆకట్టుకున్నారు ఆమె.
సినిమా చూసి పిచ్చోళ్ళు అయిపోయిన జనం.. థియేటర్స్‌లో వాంతులు.. పిల్లలు చూడకూడని ఈ మూవీ ఎక్కడ
ఇక ఇప్పుడు తల్లి, అత్తా పాత్రలతో ఆకట్టుకుంటున్నారు రాధికా శరత్ కుమార్. రాధికా తండ్రి ఎంఆర్ రాధ. ఆయన తమిళ్ లో మంచి క్రేజ్ ఉన్న నటుడు. ఆయన ఏకంగా 5 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ప్రేమావతి, ధనలక్ష్మీ, సరస్వతి, జయమ్మాళ్లను పెళ్లి చేసుకున్నాడు. చివరిగా శ్రీలంకకు చెందిన గీతను పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు మొత్తం 12మంది పిల్లలు. వారిలో శ్రీలంక మహిళ గీతకు జన్మించిన వారే రాధికా.. అలాగే ఆమెకు ఓ చెల్లి కూడా ఉంది ఆమె నిరోష. ఇక రాధికా విషయానికొస్తే ఆమె మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ముందుగా నటుడు ప్రతాప్ పోతెన్‌ను పెళ్లి చేసుకుంది రాధికా. ఆతర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. ఆతర్వాత రిచర్డ్ హార్డిని పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరు ఎక్కువకాలం కలిసుండలేదు. ఇక ఇప్పుడు శరత్ కుమార్‌ను పెళ్లి చేసుకుంది రాధికా. ఇక శరత్ కుమార్ కు అంతకు ముందే పెళ్లయింది.
ఆ రోజు తారక్ గంటసేపు ఏడ్చాడు.. మేము ఓదార్చలేకపోయాం.. ఎన్టీఆర్ గురించి రాజేంద్రప్రసాద్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








