Khadgam Movie: ‘ఖడ్గం’ సినిమాలో సంగీత పాత్రను మిస్సైన ఆ హీరోయిన్.. ముందుగా ఆమెనే సెలక్ట్ చేశారట..

ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీకాంత్.. హీరోగా అవకాశాల కోసం ప్రయత్నించే కుర్రాడిగా రవితేజ.. ముస్లిం యువకుడిగా ప్రకాష్ రాజ్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. కంటెంట్ పరంగానే కాకుండా మ్యూజిక్ పరంగానూ ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్స్. ఇక ఇందులో హీరోయిన్ సంగీత పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Khadgam Movie: 'ఖడ్గం' సినిమాలో సంగీత పాత్రను మిస్సైన ఆ హీరోయిన్.. ముందుగా ఆమెనే సెలక్ట్ చేశారట..
Sangeetha
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 03, 2024 | 5:30 PM

సినీ ప్రియులు ఎప్పటికీ మర్చిపోని సినిమా ఖడ్గం. స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుల్లితెరపై కచ్చితంగా ప్రసారమయ్యే సినిమా ఇదే. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. 2002 నవంబర్ 29న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అప్పట్లో థియేటర్లలో కలెక్షన్స్ సునామీ సృష్టించిన సినిమా ఇది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీకాంత్.. హీరోగా అవకాశాల కోసం ప్రయత్నించే కుర్రాడిగా రవితేజ.. ముస్లిం యువకుడిగా ప్రకాష్ రాజ్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. కంటెంట్ పరంగానే కాకుండా మ్యూజిక్ పరంగానూ ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్స్. ఇక ఇందులో హీరోయిన్ సంగీత పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

హీరోయిన్ కావాలని ఎన్నో ఆశలతో పల్లెటూరి నుంచి పట్నం వచ్చిన అమాయకమైన పాత్రలో నటించి మెప్పించింది సంగీత. ఈ మూవీలో సంగీత క్యారెక్టర్స్, డ్రెస్సింగ్ అప్పట్లో చాలా ట్రెండ్ అయ్యాయి. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ రవితేజ, సంగీత మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. ఇందులో సంగీతతోపాటు సోనాలి బింద్రే, కిమ్ శర్మ, పూజా భారతి హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సూపర్ హిట్ సినిమాలో మంచి ఛాన్స్ మిస్సైందట ఓ హీరోయిన్.

సినిమా మొదలైన టైంలో సంగీత పాత్రకు మరో హీరోయిన్ అనుకున్నారట డైరెక్టర్. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ సాక్షి శివానంద్. ఇదే విషయంపై ఆమెను సంప్రదించగా.. ఆమె చేయనని చెప్పేశారట. దీంతో ఆమె స్థానంలోకి సంగీతను ఫైనల్ చేశారట. ఇందులో అమాయకమైన అమ్మాయి పాత్రలో సంగీత అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా సంగీత కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

ఖడ్గం సినిమా తర్వాత సంగీతకు తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో చాలా సంవత్సరాలపాటు కొనసాగిన సంగీత.. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం కుర్రహీరోహీరోయిన్లకు తల్లిగా, వదినగా కనిపిస్తున్నారు. సర్కారు వారి పాట చిత్రంలో రష్మిక తల్లిగా కనిపించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.