AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్టీఆర్, ప్రభాస్‌లాంటి స్టార్స్‌తో సినిమాలు చేసింది.. ఇప్పుడు నటనకు గుడ్ బై చెప్పి ఇలా

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ కూడా చాలా మంది హిట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. కొంతమంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న పోటీలో చాలా మంది హీరోయిన్స్ పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ కోసం కష్టపడుతున్నారు.

ఎన్టీఆర్, ప్రభాస్‌లాంటి స్టార్స్‌తో సినిమాలు చేసింది.. ఇప్పుడు నటనకు గుడ్ బై చెప్పి ఇలా
Actress
Rajeev Rayala
|

Updated on: Aug 06, 2025 | 7:29 AM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలు తగ్గించి ఇతర బిజినెస్ ల్లో బిజీ అయిపోయారు. కొంతమంది పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. అందం అభినయం ఉండి సినిమాలకు దూరం అయినవారు  ఉన్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ కు ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే అవకాశాలు కూడా ఎక్కువగానే వచ్చాయి ఈ చిన్నదానికి. కానీ ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది. దాంతో ఆమె ఫ్యాన్ తెగ ఫీల్ అయ్యారు. అసలు ఎందుకు హీరోయిన్ గా చేయడం  లేదు అని తెగ ఆలోచిస్తున్నారు. పెళ్లి కూడా చేసుకోలేదు, వేరే బిజినెస్ ల్లో కూడా అడుగుపెట్టలేదు. అయినా హీరోయిన్ గా చేయడం లేదు. ఇంతకూ ఆ అమ్మడు ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

పై ఫొటోలో కనిపిస్తున్న భామ అందానికి ఆధార్ కార్డు లాంటి భామ  చార్మీ కౌర్ . ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మాస్, లక్ష్మి, స్టైల్, మంత్ర, జ్యోతి లక్ష్మిఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ అమ్మడు. తన నటనతో పాటు గ్లామర్ పరంగాను మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ. హీరోయిన్ గా పీక్స్ లో ఉండగానే ఛార్మి నటనకు గుడ్ బై చెప్పేసింది. నిర్మాతగా మారి ఇప్పుడు సినిమాలు చేస్తుంది ఈ పంజాబీ భామ.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో ప్రొడ్యూసర్ గా ఛార్మి పార్ట్నర్ షిప్ మొదలు పెట్టింది. పూరి జగన్నాధ్ తో కలసి ఛార్మి 8 చిత్రాలు నిర్మించింది. వాటిలో జ్యోతి లక్ష్మి, ఇస్మార్ట్ శంకర్ సినిమాలు మాత్రమే హాట్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ ఛార్మి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఛార్మి చాలా డెడికేషన్ తో వర్క్ చేస్తుంది. ఛార్మి అద్భుతమైన నటి … అందులో తిరుగులేదు. కానీ ఆమె ఎందుకు అంతగా  సక్సెస్ కాలేదు అనేది అర్ధంకావడం లేదు.. అది పూర్తిగా బ్యాడ్ లక్ అని చెప్పాలి. ఆమె డెడికేషన్ లెవల్స్ సూపర్ గా ఉంటాయి. సినిమా కోసం ఎంత కష్టమైన చేస్తుంది. దెబ్బలు తగిలి రక్తం వస్తునప్పటికీ పట్టించుకోకుండా నటిస్తూనే ఉంటుంది. శ్రీ ఆంజనేయం, చక్రం లాంటి చిత్రాల్లో కొన్నిసార్లు అలా జరిగింది అని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.