
సినిమా ఇండస్ట్రీలో లవ్ ఎఫర్స్, సహజీవనం, పెళ్లి, విడాకులు ఇలా చాలా కామన్ అయ్యాయి. సెలబ్రెటీలకు సంబందించిన రిలేషన్స్ మాత్రం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ స్టార్ డమ్ తెచ్చుకున్న తర్వాత కెరీర్ పీక్ లో ఉండగానే లవ్ ఎఫైర్స్ కారణంగా కెరీర్ పోగొట్టుకున్నవారు, ఇండస్ట్రీకి దూరమైన వారు కూడా ఉన్నారు. వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఈ హీరోయిన్ ఒకప్పుడు అందాల తార, తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. 6 గురు పిల్లల తండ్రితో ఎఫైర్ పెట్టుకుంది. అప్పటిలో ఇది ఒక సెన్సేషనల్ న్యూస్.. ఆ 6 గురు పిల్లల తండ్రిని పెళ్లి చేసుకోలేదు కానీ అతనితో సహజీవనం చేసింది. పెళ్లికాకుండానే ఇద్దరిపిల్లల తల్లి అయ్యింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా. ఆమె కూతురు ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ ఇంతకూ ఆమె ఎవరంటే..
ఆమె మరెవరో కాదు అలనాటి అందాల తార పుష్పవల్లి. ఆమె అసలు పేరు కందల వెంకట పుష్పవల్లి తాయారామ్మ. పుష్పవల్లి 1930ల నుండి 1960ల వరకు 40కి పైగా చిత్రాలలో నటించింది. ఆమె ప్రధానంగా లీడ్ రోల్స్, మిథాలజికల్, సామాజిక చిత్రాలలో కనిపించింది. ఆమె గ్రేస్‌ఫుల్ నటన, అందం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా పుష్పవల్లి 1940 మొదటి వివాహం చేసుకుంది. ఆతర్వాత భర్త నుంచి విపోయింది. ఆతర్వాత ప్రముఖ నటుడు జెమినీ గణేషన్‌తో ప్రేమలో పడింది. అప్పటికే గణేష్ కు పెళ్ళై ఆరుగురు పిల్లలున్నారు.
జెమినీ గణేషన్ పుష్పవల్లి పెళ్లి చేసుకోలేదు.. కానీ సహజీవనం గడిపారు. వీరికి ఇద్దరు పిల్లలు వారిలో ఒకరు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన రేఖ ఒకరు. మరొకరు రాధా ఆమె తమిళ్‌లో కొన్ని సినిమాల్లో నటించి ఆతర్వాత సినిమాలకు దూరం అయ్యారు. గణేష్ తో పెళ్లి కాకపోయినా పుష్పవల్లి జీవితాంతం ఆయనతోనే కలిసి ఉంది. అలాగే తన కూతుర్లను హీరోయిన్ గా ప్రోత్సహించింది. గణేష్ మొదట్లో రేఖను కూతురిగా అంగీకరించలేదు. ఆతర్వాత ఆయన కూతురి పై ప్రేమ చూపించాడు. ఇక రేఖ కూడా ఇండస్ట్రీలో కొన్ని ప్రేమకథలు నడిపింది. బిగ్ బి అమితాబ్ తో ఆమె ప్రేమాయణం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.