AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిరాయ్‌లో అదరగొట్టిన ఈ లేడీ విలన్ ఎవరో తెలుసా.? అమ్మబాబోయ్ ఈమె బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా..

తేజ సజ్జ హీరోగా నటించిన మిరాయ్ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన మిరాయ్ మొదటి రోజే మంచి టాక్ తోపాటు ఓపినింగ్స్ కూడా సాధించింది. రితిక్ నాయక్ ఇందులో హీరోయిన్ గా నటించగా , మంచు మనోజ్ ప్రతినాయకుడిగా కనిపించి మెప్పించాడు. అలాగే ఒకప్పటి టాలీవుడ్ అందాల తార శ్రియా శరణ్ ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించింది.

మిరాయ్‌లో అదరగొట్టిన ఈ లేడీ విలన్ ఎవరో తెలుసా.? అమ్మబాబోయ్ ఈమె బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా..
Mirai
Rajeev Rayala
|

Updated on: Sep 15, 2025 | 12:41 PM

Share

యంగ్ సూపర్‌స్టార్ తేజ సజ్జా నటించిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ‘మిరాయ్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా..రితిక నాయక్ హీరోయిన్ గా, శ్రీయా శరణ్, జగపతి బాబు, జయరామ్ వంటి స్టార్ కాస్ట్‌తో ప్రేక్షకులను అలరించింది. సెప్టెంబర్ 12, 2025న విడుదలైన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే భారీ కలెక్షన్స్ సాధించి, తేజ సజ్జా మునుపటి హిట్ ‘హనుమాన్’ను మించి  ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. సెప్టెంబర్ 14న మూడో రోజున ఇండియా నెట్‌లో రూ.14-15 కోట్లు సంపాదించి, మూడు రోజులకు మొత్తం రూ.44-50 కోట్లకు చేరిందని తెలుస్తుంది. అలాగే వరల్డ్‌వైడ్‌లో మూడు రోజుల్లో రూ.60 కోట్లు దాటినట్టు అంచనా.

ఇండస్ట్రీ వల్గర్‌గా తయారైంది.. ఓపెన్‌గా కమిట్‌మెంట్‌ అడుగుతున్నారు.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

ఇక మిరాయ్ సినిమాలో యాక్షన్ సీన్స్, వీఎఫ్ఎక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమాకు రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే మిరాయ్ సినిమాలో నటించిన ఈ నటి గుర్తుందా.? మంచు మనోజ్ రైట్ హ్యాండ్ నటించి అదరగొట్టింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో ఆమె ఇరగదీసిందనే చెప్పాలి. ఆమె పేరు తాంజ కెల్లర్.

ఇవి కూడా చదవండి

ఇద్దరు స్టార్ హీరోలు.. పెద్ద హీరోయిన్.. రూ.200కోట్ల బడ్జెట్.. కట్ చేస్తే భారీ డిజాస్టర్

ఆమె ఒక హాలీవుడ్ నటి. ప్రధానంగా యూరపియన్ సినిమాల్లో, జర్మన్ ఫిల్మ్స్‌లో నటిస్తుంది. ఆమె కెరీర్‌లో యాక్షన్, థ్రిల్లర్ జానర్‌లు ఎక్కువగా ఉంటాయి. తాంజ కెల్లర్ జర్మన్ లో పుట్టింది. యాక్షన్ ట్రైనింగ్ తీసుకుని, స్టంట్ వర్క్‌లో ప్రవీణ్యం పొందింది. “మిరాయ్” సినిమాతో ఆమె ఇండియన్ సినిమాకు పరిచయం అయ్యింది. అలాగే ఆమె పాత్ర సినిమాకు అదనపు హైలైట్ అయింది. ఆమె పాత్ర మిరాయ్ లో చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుంది. అదేవిధంగా సినిమాలో ఆమె ఫైట్ సీన్స్, రూథ్‌లెస్ క్యారెక్టర్‌తో సినిమాను స్టీలింగ్ చేసిందని, సర్‌ప్రైజ్ స్టార్‌గా నిలిచిందని విమర్శకులు ప్రశంసించారు.

బాబోయ్.. బీభత్సం..! రవితేజ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా.! ఈ దెబ్బతో హీరోయిన్స్ అవుట్

View this post on Instagram

A post shared by Tanja Keller (@tanjakel)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..
ఆ రోజు చిరంజీవి కూడా వచ్చారు.. TV9 క్రాస్‌ఫైర్‌లో అంబటి రాంబాబు..
ఆ రోజు చిరంజీవి కూడా వచ్చారు.. TV9 క్రాస్‌ఫైర్‌లో అంబటి రాంబాబు..
వాషింగ్ మెషీన్‌లో షూస్ క్లీనింగ్.. మీరు ఈ తప్పులు చేస్తున్నారా?
వాషింగ్ మెషీన్‌లో షూస్ క్లీనింగ్.. మీరు ఈ తప్పులు చేస్తున్నారా?
ఒకే ఒక్కడి కోసం ఎగ్జామ్ సెంటర్.. కట్‌చేస్తే.. ఊహించని ట్విస్ట్
ఒకే ఒక్కడి కోసం ఎగ్జామ్ సెంటర్.. కట్‌చేస్తే.. ఊహించని ట్విస్ట్
టీ20ల్లో టీమిండియాకి కోహ్లీ లాంటి కరెక్ట్ మొనగాడు దొరికాడు.
టీ20ల్లో టీమిండియాకి కోహ్లీ లాంటి కరెక్ట్ మొనగాడు దొరికాడు.