Actress : తండ్రి సూపర్ స్టార్.. భర్త తోపు క్రికెటర్.. అట్టర్ ప్లాప్ హీరోయిన్.. సినిమాలు లేకపోయినా భారీగా సంపాదన
తండ్రి సూపర్ స్టార్. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పై ఆసక్తి పెంచుకున్న ఈ అమ్మడు.. కథానాయికగా తెరంగేట్రం చేసింది. కానీ ఆమె నటించిన చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు. అలాగే ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో కూతురు కథానాయికగా తెరంగేట్రం చేసింది. తక్కువ సమయంలోనే మంచి మార్కులు కొట్టేసింది. తండ్రి సూపర్ స్టార్ అయినప్పటికీ ఈ బ్యూటీకి మాత్రం ఆశించిన స్థాయిలో అదృష్టం కలిసి రాలేదు. ఆమె నటించిన చిత్రాలు అట్టర్ ప్లాప్ కావడంతో ఆఫర్స్ తగ్గిపోయాయి. ఆ తర్వాత టీమిండియా క్రికెటర్ ను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ అతియా శెట్టి. బీటౌన్ సూపర్ స్టార్ సునీల్ శెట్టి కూతురు. హిందీ సినీరంగంలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన సునీల్ శెట్టి దక్షిణాది సినీప్రియులకు సైతం సుపరిచితమే. ఇటీవల రజనీకాంత్ నటించిన దర్బార్ చిత్రంలో సునీల్ శెట్టి విలన్ పాత్ర పోషించారు.
ఇవి కూడా చదవండి : Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..
అయితే అతియా శెట్టి మాత్రం తండ్రిలాగా చిత్రపరిశ్రమలో ఆశించిన స్థాయిలో గొప్ప విజయాన్ని సాధించలేకపోయింది. కొన్ని చిత్రాలతో ఆమె పెద్దగా సంచలనం సృష్టించలేకపోయినా, ప్రకటనల ప్రపంచంలో ఆమె చాలా డబ్బు సంపాదిస్తుంది. ఆమె తన ప్రత్యేకమైన నటనతో అభిమానుల హృదయాల్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. ఇటీవలే ప్రముఖ క్రికెటర్ కెఎల్ రాహుల్‌ను వివాహం చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?
ఇదిలా ఉంటే.. ఈ అమ్మడు వాణిజ్య ప్రకటనలలో నటించడం ద్వారా మంచి ఆదాయాన్ని సంపాదిస్తుంది. నివేదికల ప్రకారం, అతను ఒక వాణిజ్య ప్రకటనలో నటించడం ద్వారా రూ. 1 కోటి నుండి రూ. 2 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందట. తండ్రి సునీల్ శెట్టి చాలా ధనవంతుడు అయినప్పటికీ, అతియా శెట్టి వ్యక్తిగత సంపద దాదాపు రూ. 45 కోట్లు ఉంటుందని అంచనా.
ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..
ఇవి కూడా చదవండి : Gouri Kishan: నీ బరువు ఎంత ? రిపోర్టర్ ప్రశ్న.. హీరోయిన్ మాస్ రిప్లై..




