Tollywood : ఒకప్పుడు మహేష్ బాబుతో స్పెషల్ సాంగ్.. కట్ చేస్తే.. అదే హీరోకు తల్లిగా నటించిన హీరోయిన్..
దాదాపు 20 ఏళ్ల క్రితం మహేష్ బాబుతో కలిసి స్పెషల్ పాటలో స్టెప్పులేసింది. ఆ తర్వాత అతడికే తల్లి పాత్రలో నటించిన హీరోయిన్ ఎవరో మీకు తెలుసా.. ? ఇప్పటికీ సినీరంగంలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తెలుగు, తమిళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..

సాధారణంగా సినీరంగంలో స్టార్ హీరోస్ చాలా సంవత్సరాలుగా సినిమాల్లో నటిస్తుంటారు. కానీ హీరోయిన్స్ అలా కాదు.. కొన్నేళ్లకే ఫేడౌట్ అయిపోతుంటారు. ఒకప్పుడు సినిమాల్లో టాప్ హీరోయిన్లుగా చక్రం తిప్పిన తారలు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయ్యారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో స్టార్ హీరోల చిత్రాల్లో అత్త, అమ్మ, వదిన పాత్రలు పోషిస్తూ సినీప్రియులను అలరిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సీనియర్ హీరోయిన్ గురించి మీకు తెలుసా.. ? అప్పట్లో మహేష్ బాబు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. కట్ చేస్తే కొన్నాళ్లకు అదే హీరోకు తల్లిగా నటించింది. ఆమె మరెవరో కాదు.. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణన్.
ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..
2004లో తెలుగులో ఎస్.జే సూర్య దర్శకత్వంలో సూపర్ స్టా్ర్ మహేష్ బాబు నటించిన సినిమా నాని. ఇందులో అమీషా పటేల్, దేవయాని, నాసర్, ఐశ్వర్య కీలకపాత్రలు పోషించారు. తమిళంలో విడుదలైన న్యూ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు ఎస్జే.సూర్య. ఈ చిత్రానికి ఎ.ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అయితే ఈ సినిమాలో రమ్య కృష్ణ స్పెషల్ సాంగ్ చేసింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఆ పాట సూపర్ హిట్ అయ్యింది.
ఇవి కూడా చదవండి : Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..
ఇక ఇటీవలే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన సినిమా గుంటూరు కారం. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించగా.. ప్రకాష్ రాజ్, జయరామ్, జగపతి బాబు, సునీల్, మీనాక్షి చౌదరి కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీలో మహేష్ బాబు తల్లి పాత్రలో రమ్య కృష్ణ నటించింది. 2004లో మహేష్ బాబుతో కలిసి స్పెషల్ సాంగ్ చేసిన రమ్యకృష్ణ.. దాదాపు 20 ఏళ్లకు అదే హీరోకు తల్లిగా కనిపించింది. ప్రస్తుతం మహేష్ బాబు SSMB 29 నటిస్తున్నారు. ఈ చిత్రం 2027లో థియేటర్లలోకి రానుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?




