Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. మాఫియా డాన్‏కే ఎదురుతిరిగి.. 32 ఏళ్లకే సినిమాలకు దూరం.. ఇప్పుడు..

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో తోపు హీరోయిన్. 2000 సంవత్సరంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అడియన్స్ హృదయాలను ఏలేసింది. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు దూరమైంది. కట్ చేస్తే.. ఇప్పుడు వ్యాపార రంగంలో దూసుకుపోతుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరంటే..

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. మాఫియా డాన్‏కే ఎదురుతిరిగి.. 32 ఏళ్లకే సినిమాలకు దూరం.. ఇప్పుడు..
Preity Zinta

Updated on: Jun 01, 2025 | 12:23 PM

దక్షిణాదిలో ఒకప్పుడు తోపు హీరోయిన్. అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది. సినీరంగంలో నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని.. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. అందమైన రూపం.. డింపుల్ చిరునవ్వుతో కుర్రకారు హృదయాలు గెలుచుకుంది. అంతేకాదు.. అప్పట్లో తెలుగు, హిందీ భాషలలో బాక్సాఫీస్ ఏలేసింది. కట్ చేస్తే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 32 ఏళ్ల వయసులో సినిమాలకు దూరమైంది. ఇప్పుడు క్రికెట్ వ్యాపారరంగంలో దూసుకుపోతుంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? 2000ల ప్రారంభంలో, రాణి ముఖర్జీ, ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్, కాజల్ వంటి ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న సమయంలోనే ఆమె ఎంట్రీ ఇచ్చింది. సొట్టబుగ్గల చిరునవ్వు, పక్కింటి అమ్మాయిల కనిపిస్తూ అద్భుతమైన నటనతో మెప్పించింది.

తక్కువ సమయంలోనే అగ్ర కథానాయికగా మారింది. ఆమె మరెవరో కాదు.. ప్రీతిజింటా. 2000ల ప్రారంభంలో ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్. 1997లో 22 ఏళ్ల వయసులో డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన దిల్ సే సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సోల్జర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో దిల్ చాహ్తా హై, కల్ హో నా హో, వీర్ జరా, కభీ అల్విదా నా కెహ్నా వంటి చిత్రాలలో నటించింది. తెలుగులోనూ అనేక చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. 32 ఏళ్ల వయసులోనే సినిమాలకు దూరమైంది. కొన్నాళ్లపాటు 2014లో మరోసారి రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమె నటించిన చిత్రాలు అంతగా సక్సెస్ కాలేదు.

2001లో బాలీవుడ్ అండర్ వరల్డ్ బెదిరింపులతో నిండిపోయినప్పుడు గ్యాంగ్ స్టర్ చూటా షకీల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది. తనను బెదిరించి రూ. 50 లక్షలు డిమాండ్ చేశారని పేర్కొంది. 26 ఏళ్ల వయసులోనే గ్యాంగ్ స్టర్ బెదిరింపులకు ఎదురుతిరిగింది. 2011లో కమల్ అమ్రోహి కుమారుడు, చిత్రనిర్మాత షాందర్ అమ్రోహి తన 600 కోట్ల ఆస్తిని ప్రీతిజింటాకు ఇవ్వాలనుకుంటున్నట్లు బహిరంగంగా ప్రకటించాడు. అతడు ఆమెను తన కూతురిగా భావించాడు. కానీ ఆ మొత్తాన్ని ప్రీతి జింటా తిరస్కరించింది. వేరొకరి వారసత్వం తనకు వద్దని తెలిపింది. ప్రీతి జింటా రూ.150 కోట్లకు యజమాని.

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..