AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాఫ్ట్ వేర్ జాబ్ వదిలి సినిమాల్లోకి… ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అమ్మడు..! ఆమె ఎవరంటే

చాలా మంది ముద్దుగుమ్మలు సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ మధ్య కాలంలో సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలు చాలా వరకు తక్కువ ఉంటున్నాయి. దాంతో సినిమాలతో పాటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

సాఫ్ట్ వేర్ జాబ్ వదిలి సినిమాల్లోకి... ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అమ్మడు..! ఆమె ఎవరంటే
Actress Pic
Rajeev Rayala
|

Updated on: Jun 29, 2026 | 8:58 PM

Share

సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంత ఈజీ కాదు.. సినిమాల్లో అవకాశం తెచ్చుకోవడమే కష్టం.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కొందరు స్టార్ డమ్ సొంతం చేసుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఎన్ని సినిమాలు చేసినా స్టార్ డమ్ సొంతం చేసుకోలేకపోతున్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ ఈ చిన్నది. సాఫ్ట్ వేర్ నుంచి సినిమాల్లోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ చిన్నది ఆతర్వాత పెద్దగా హిట్స్ అందుకోలేకపోతుంది. ఇంతకూ ఈ ఆముద్దుగుమ్మ ఎవరో తెలుసా.? ఆమె అందానికి ఎలాంటి కుర్రాడైన ఫిదా అయిపోవాల్సిందే. ఆమె మరెవరో కాదు మన తెలుగమ్మాయే..

ఇది కూడా చదవండి : Tollywood : ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్

తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా ఆఫర్స్ తో ఫుల్ బిజీగా మారిపోయింది ఆమె అనన్య నాగళ్ల. కెరీర్ బిగినింగ్ లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది అనన్య. అలాగే ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి రాక ముందు ఐటీ కంపెనీలో జాబ్ చేసింది. అయితే సినిమాల పై మక్కువతో సినిమాల్లోకి వచ్చింది ఈ చిన్నది. మల్లేశం సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మల్లేశం సినిమాలో అనన్య తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్‌తో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తాం అంటున్నారు.. రోడ్డు మీద పట్టుకొని కొట్టారు..! కన్నీళ్లు పెట్టుకున్న నటుడు

ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది కానీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. కానీ ప్రతి సినిమాలో తన నటనతో కట్టిపడేసింది అనన్య. అంతే కాదు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను కవ్విస్తుంది. ఇటీవల గ్లామర్ డోస్ పెంచేస్తూ నెటిజన్స్‌ను దర్శక నిర్మాతలను ఆకర్షిస్తుంది. ప్రస్తుతం అనన్య పెద్ద మూవీ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దొరికితే ఈ అమ్మడు టాలీవుడ్ లో మరింత బిజీగా మారిపోతుంది అంటున్నారు అభిమానులు. మరి అనన్యకు బడా హీరోల సినిమాల్లో ఛాన్స్ లు వస్తాయేమో చూడాలి.

ఇది కూడా చదవండి :చిన్న సినిమా.. కట్ చేస్తే 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు..! ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us