Tollywood: 14 ఏళ్లకే టాప్ హీరోయిన్.. చిరంజీవితో 19.. బాలకృష్ణతో కలిసి 16 సినిమాలు చేసిన ఏకైక హీరోయిన్..

చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. స్టార్ హీరోల సరసన నటించిన ఆమె.. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సత్తా చాటింది. దశాబ్దాలపాటు సినీరంగంలో చక్రం తిప్పిన హీరోయిన్.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Tollywood: 14 ఏళ్లకే టాప్ హీరోయిన్.. చిరంజీవితో 19.. బాలకృష్ణతో కలిసి 16 సినిమాలు చేసిన ఏకైక హీరోయిన్..
Chiranjeevi, Balakrishna

Updated on: Jun 27, 2025 | 8:44 AM

అందం, అభినయంతో సినీరంగంలో తనదైన ముద్ర వేసిన హీరోయిన్. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగు, హిందీ, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, సుమన్, కృష్ణ వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే లేడీ ఓరియెంటెడ్, మాస్ యాక్షన్ చిత్రాలతో సత్తా చాటింది. అప్పట్లో ఆమెను ఫ్యాన్స్ అంతా లేడీ అమితాబ్ అని పిలుచుకునేవారు. అద్భుతమైన నటనతో జాతీయ అవార్డును సైతం అందుకుంది. దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆ హీరోయిన్.. మరెవరో కాదు.. సౌత్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. 1980లో కల్లుక్కల్ సినిమాతో నటిగా ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది. అప్పుడు ఆమె వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే.

మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న ఆమె.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి 19 సినిమాలు.. బాలకృష్ణతో కలిసి 16 సినిమాల్లో పనిచేసింది. అలాగే 1991లో కర్తవ్యం సినిమాలో ఐపీఎస్ అధికారిణి పాత్రలో కనిపించి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో ఆమె పేరు మారుమోగింది. ఇందులో ఆమె నటనకు గానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. ఇందులో వినోద్ కుమార్ ప్రధాన పాత్ర పోషించారు. విజయశాంతి 4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ లోనూ బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకున్నారు. అనిల్ కపూర్ నటించిన ఈశ్వర్ సినిమాలో లలిత పాత్రలో కనిపించింది. ఇందులో ఆమె నటనకు మరో ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది.

కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే లేడీ ఓరియెంటెడ్, మాస్ యాక్షన్ చిత్రాలను ఎంచుకుని రిస్క్ చేసింది విజయశాంతి. కానీ ఆ చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ తిరగరాశాయి. చాలా సంవత్సరాలపాటు సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో కొనసాగింది విజయశాంతి. కానీ 2020లో మహేష్ బాబు,రష్మిక మందన్నా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇటీవలే కళ్యాణ్ రామ్ నటించిన సన్నాఫ్ వైజయంతి సినిమాలో కీలకపాత్రలో కనిపించింది.

ఇవి కూడా చదవండి

Vijayashanthi

ఇవి కూడా చదవండి : 

Telugu Cinema: టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్‏తో రచ్చ చేస్తుంది.. ఈ క్యూటీ ఎవరంటే..

చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..

Nuvvostanante Nenoddantana: ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్.. మహిళలకు రోల్ మోడల్‏.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..