AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 10 వేలతో ముంబైకు.. యోగా టీచర్‏గా మారింది.. కట్ చేస్తే.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్

ఢిల్లీలో పుట్టి పెరిగి.. గ్రాడ్యుయేషన్ తర్వాత నటనపై ఆసక్తితో 2013లో ముంబైకి చేరుకుంది. కానీ అవకాశాల కోసం సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లల్లో ఎన్నో కష్టాలను, అవమానాలను ఎదుర్కొంది. 10 వేలతో ముంబైకు వచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత మహిళలకు యోగా నేర్పింది. కానీ ఫస్ట్ మూవీతోనే హీరోయిన్ గా సంచలనం సృష్టించింది.

Tollywood: 10 వేలతో ముంబైకు.. యోగా టీచర్‏గా మారింది.. కట్ చేస్తే.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్
Actress
Rajitha Chanti
|

Updated on: Feb 02, 2025 | 7:44 PM

Share

సినీ పరిశ్రమలో విజయం సాధించడం అంత తేలికైన విషయం కాదు. డ్యాన్స్ టీచర్‌గా 15,000 రూపాయల జీతంతో ముంబైలో కొన్నాళ్లు నివసించింది. అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే పలువురు మహిళలకు యోగ్ టీచర్ గా పనిచేసింది. ఆ తర్వాత నెమ్మదిగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి పలు ప్రకటనలలో కనిపించింది. తర్వాత ఆఫర్స్ కోసం కొన్ని ఆఫీసుల చుట్టూ తిరిగింది. అయినప్పటికీ ఎలాంటి ఛాన్స్ రాకపోవడంతో తిరిగి యోగ్ టీచర్ గా మారింది. కానీ కొన్ని రోజులకు కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రా నుండి కాల్ వచ్చింది. అది అమీర్ ఖాన్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం దంగల్ లో కీలక పాత్ర పోషించేలా చేసింది. దీంతో రాత్రికి రాత్రే ఆమె స్టార్ స్టేటస్ అందుకుంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ సన్యా మల్హోత్రా.

ఢిల్లీలో పుట్టి పెరిగిన సన్యా మల్హోత్రా 2013లో గ్రాడ్యుయేషన్ తర్వాత నటనలో వృత్తిని కొనసాగించేందుకు ముంబైకి వెళ్లింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నగరంలో తాను ఎదుర్కొన్న పోరాటాల గురించి అనేక విషయాలు బయటపెట్టింది. డ్యాన్స్ పట్ల ఆమెకున్న మక్కువ ఆమెను కాలేజీలో కొరియోగ్రఫీ సొసైటీలో చేరేలా చేసింది. తర్వాత ఢిల్లీలోని బ్యాలెట్ కంపెనీ, స్కూల్‌లో డ్యాన్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసింది. డ్యాన్స్ టీచర్‌గా తన మొదటి జీతం 15,000 సంపాదించి తన తల్లిదండ్రులకు బహుమతిగా ఇచ్చింది సన్యా. ఆమెకు డ్యాన్స్ అంటే ఇష్టం అయినప్పటికీ, నటించాలనేది కోరిక. డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షో ఆడిషన్ కోసం ఆమె తన డ్యాన్స్ టీచింగ్ ఉద్యోగాన్ని వదిలిపెట్టింది. ఆ తర్వాత కేవలం రూ. 10,000తో, కొరియోగ్రాఫర్‌లు లేదా దర్శకులకు సహాయం చేయడానికి కూడా ఆమెకు పని దొరక్క ఇబ్బంది పడింది. కానీ ఆఫర్‌లు రాలేదు. ఆ సమయంలో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న సమయంలో తన అపార్ట్మెంట్ లో ఉండే మహిళలకు యోగా నేర్పింది.

ఓ కమర్షియల్ యాడ్ లో సెకండ్ లీడ్ పాత్ర పోషించింది. ఆ తర్వాత కొద్ది రోజులకు కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రా ఆఫీస్ నుంచి తనకు కాల్ వచ్చింది. అమీర్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ దంగల్ లో ప్రధాన పాత్ర కోసం ఒకసారి అడిషన్ కు రావాలని సదరు ఆఫీస్ సిబ్బంది తెలియజేశారట. దీంతో అక్కడకు వెళ్లిన సన్యా.. అమీర్ ఖాన్‌తో వరుస ఆడిషన్‌లు, సమావేశాల తర్వాత, గీతగా నటించిన ఫాతిమా సనా షేక్‌తో పాటు బబితా కుమారి పాత్రకు ఎంపికైంది. ఇది ఆమె కెరీర్‌ను ఒక మలుపు తిప్పింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది. తన 9 సంవత్సరాల కెరీర్‌లో బదాయి హో, జవాన్, లవ్ హాస్టల్, కథల్, సామ్ బహదూర్‌తో సహా 15 చిత్రాలలో నటించింది.

ప్రస్తుతం ఆమె ఆర్తి కడవ్ దర్శకత్వం వహించిన శ్రీమతి చిత్రంలో కనిపించనుంది. ఇందులో పెళ్లి తర్వాత సామాజిక అంచనాలను నావిగేట్ చేసే నృత్యకారిణి, ఉపాధ్యాయురాలిగా కనిపించనుంది. ఆమె తన నటనకు 2024 న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ఉత్తమ నటి’ అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రం మలయాళ డ్రామా ది గ్రేట్ ఇండియన్ కిచెన్‌కి రీమేక్. ఇది ఫిబ్రవరి 7, 2025న జీ5లో విడుదల కానుంది.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన