Dulquer Salmaan: ‘ఆకాశంలో ఒక తార’ అంటోన్నదుల్కర్ సల్మాన్.. మరో తెలుగు సినిమా ప్రారంభం.. డైరెక్టర్ ఎవరంటే?
మల్టీటాలెంటెడ్, దక్షిణాది స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమా సినిమాకీ అభిమాన గణాన్ని పెంచుకుంటూ పోతోన్నారు. దుల్కర్‌కు ప్రస్తుతం తెలుగులో తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పిస్తున్నారీ హ్యాండ్సమ్ హీరో.

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. ఇలా తెలుగులో బ్యాక్ బు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకున్నాడు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. ఇప్పుడు తెలుగులోనే మరో క్రేజీ ప్రాజెక్టును పట్టాలెక్కించాడీ హ్యాండ్సమ్ హీరో. క్రేజీ డైరెక్టర్ పవన్ సాదినేని కాంబినేషన్ లో దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న సినిమా అధికారికంగా ప్రారంభమైంది. లైట్ బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఆకాశంలో ఒక తార’ అనే టైటిల్‌ను పెట్టారు. ఇక ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కోసం ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, గుణ్ణం గంగరాజు కలిసి ముందుకు వచ్చారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు ఈ చిత్ర నిర్మాణంలో భాగమయ్యాయి. ‘ఆకాశంలో ఒక తార’ ఆదివారం (ఫిబ్రవరి 02) నాడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్విని దత్ వంటి వారు హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, అశ్విని దత్ కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి గుణ్ణం గంగరాజు దర్శకత్వం వహించారు.
నటీనటులు, ఇతర సిబ్బందికి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. టాలెంటెడ్ సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫర్‌గా, శ్వేత సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేయనున్నారు. ‘ఆకాశంలో ఒక తార’ తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.
తారాగణం: దుల్కర్ సల్మాన్ తదితరులు
సాంకేతిక బృందం:
బ్యానర్: లైట్ బాక్స్ మీడియా నిర్మాతలు: సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం సమర్పణ : గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా దర్శకుడు: పవన్ సాదినేని రచయిత: గంగరాజు గుణ్ణం DOP: సుజిత్ సారంగ్ ప్రొడక్షన్ డిజైనర్ : శ్వేత సాబు సిరిల్
ఆకాశంలో ఒక తార మూవీ పూజా సెర్మనీ ఫొటోలు
Three legendary production houses @GeethaArts @Lightboxoffl @SwapnaCinema coming together to create a beautiful tale, with none other than the man @dulQuer leading the way! A dream come true moment💫✨#AakasamLoOkaTara 🌟 pic.twitter.com/dtmV6VICNF
— pavan sadineni (@pavansadineni) February 2, 2025
పాన్ ఇండియా మూవీగా..
DULQUER SALMAAN STARS IN PAN-INDIA FILM: LAUNCHED WITH POOJA CEREMONY… #DulquerSalmaan and director #PavanSadineni team up for #AakasamLoOkaTara, presented by esteemed production houses #GeethaArts and #SwapnaCinema.#AakasamLoOkaTara is produced by #SandeepGunnam and… pic.twitter.com/OQvj6ql0lv
— taran adarsh (@taran_adarsh) February 2, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.