Tollywood: ఆ స్టార్ హీరోతో స్పెషల్ సాంగ్.. దెబ్బకు సెన్సేషన్.. కట్ చేస్తే.. ఇప్పుడు సినిమాలకు దూరంగా..
సినిమాల్లో విజయవంతమైన కెరీర్.. తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుుడు సినిమా ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. కానీ సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..

భారతీయ సినీపరిశ్రమలో ఒకప్పుడు అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలలో ఆమె ఒకరు. దాదాపు ఐదు భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో రవితేజ, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. సినిమాల్లో విజయవంతమైన కెరీర్ కొనసాగించిన ఈ అమ్మడు పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. కొన్నాళ్లు సైలెంట్ అయిన ఈ అమ్మడు.. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. పలు రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరించింది. హిందీలో ఆమె చేసిన తొలి చిత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. కానీ షారుఖ్ ఖాన్ సరసన చేసిన ఒక్క స్పెషల్ పాటతో నెట్టింట సెన్సేషన్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ ప్రియమణి. ఈరోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీతారలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
18 ఏళ్ల వయసులోనే నటిగా సినీప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. 2003లో ఎవరే అతగాడు సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2007లో తమిళ చిత్రం పరుత్తివీరన్‌లో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకుంది. ఇక మణిరత్నం దర్శకత్వం వహించిన రావణ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు. అయితే కొన్నాళ్లు తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిన ప్రియమణి 2013లో వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రంలో కనిపించింది. ఇందులో షారుఖ్ ఖాన్ తో కలిసి 1234 అనే స్పెషల్ సాంగ్ తో ఇరగదీసింది. అప్పట్లో ఈ సాంగ్ సెన్సేషన్ అయ్యింది. ఆ తర్వాత ది ఫ్యామిలీ మ్యాన్, ఆర్టికల్ 370 వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది.
2017లో ప్రియమణి ఈవెంట్ మేనేజర్ నుండి సినిమా డైరెక్టర్‌గా మారిన ముస్తఫా రాజ్‌ను వివాహం చేసుకుంది. తాను మతాంతర వివాహం చేసుకోవడం వల్ల తనకు అనేక బెదిరింపులు వచ్చాయని తెలిపింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తుంది. ఆమె చివరిగా నటించిన సినిమా ‘ఆఫికల్ ఆన్ డ్యూటీ’ ఫిబ్రవరి 20, 2025న విడుదలైంది. ఇందులో కుంచాకో బోబన్ ప్రధాన పాత్ర పోషించారు. ఆమె చకోచన్ భార్య, దృఢ సంకల్పం కలిగిన కళాశాల ప్రొఫెసర్ పాత్రలో కనిపించింది.
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..




