AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor : ఒకప్పుడు రైళ్లల్లో పాటలు పాడిన కుర్రాడు.. ఇప్పుడు రూ. 1200 కోట్ల సినిమాటిక్ విశ్వంలోకి.. ఎవరంటే..

కాలేజీ రోజుల్లో రైళ్లలో పాటలు పాడాడు. సినిమాల్లోకి అడుగెపెట్టాక అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ ఆత్మవిశ్వాసం, ప్రతిభతో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు అతడు స్టార్ హీరో. ప్రస్తుతం థామాతో కలిసి మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో చేరబోతున్నాడు. ఇందులో రష్మిక మందన్న, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్ కూడా నటిస్తున్నారు.

Actor : ఒకప్పుడు రైళ్లల్లో పాటలు పాడిన కుర్రాడు.. ఇప్పుడు రూ. 1200 కోట్ల సినిమాటిక్ విశ్వంలోకి.. ఎవరంటే..
Ayushmann Khurrana
Rajitha Chanti
|

Updated on: Sep 12, 2025 | 10:25 PM

Share

హిందీ సినిమా ప్రపంచంలో సాధారణ కుర్రాడు రాణించడం చాలా కష్టం. అలాంటింది ఓ అబ్బాయి మాత్రం ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశాడు. ప్రస్తుతం అతడు బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. కరణ్ జోహార్ తిరస్కరించిన తర్వాత కూడా, అతను అనేక రూ. 100 కోట్ల హిట్‌లను అందించాడు. ఇప్పుడు మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతడు మరెవరో కాదు.. ఆయుష్మాన్ ఖురానా. చండీగఢ్‌లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయుష్మాన్ ఖురానా కేవలం విక్కీ డోనార్, ఆర్టికల్ 15, దమ్ లగా కే హైషా, బదాయి హో, అంధాధున్ వంటి చిత్రాల కనిపించారు.

నటుడిగానే కాదు.. ఫేమస్ సింగర్ కూడా. పానీ ద రంగ్, సద్ది గాలి, నైనా ద క్యా కసూర్ వంటి పలు చార్ట్‌బస్టర్ పాటలను పాడారు.2017లో మేరీ ప్యారీ బిందును ప్రమోట్ చేస్తున్నప్పుడు, ఆయుష్మాన్ తన స్నేహితులతో కలిసి రైళ్లలో ఎలా పాటలు పాడేవాడో, తన కళాశాల ప్రయాణాలకు ఎలా నిధులు సమకూర్చుకునేవాడో గుర్తుచేసుకున్నారు. 2018లో కాఫీ విత్ కరణ్ సీజన్ 6లో విక్కీ కౌశల్ తో కలిసి ఆయుష్మాన్ ఖురానా కనిపించినప్పుడు, కరణ్ జోహార్ ఒకసారి తనను తిరస్కరించాడని అన్నారు. ఆయుష్మాన్ ఖురానా రెండు సంవత్సరాల తర్వాత బాలీవుడ్‌లో తిరిగి అడుగుపెట్టబోతున్నాడు. ఇది మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో తదుపరి భాగం.

ఆయుష్మాన్ తో పాటు, థమాలో రష్మిక మందన్న, పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 21న దీపావళి సందర్భంగా విడుదల కానుంది. హర్షవర్ధన్ రాణే, సోనమ్ బజ్వా నటించిన రొమాంటిక్ డ్రామా ‘ఏక్ దీవానే కి దీవానియాత్’ తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది.

ఇవి కూడా చదవండి : Cinema : ఈ సినిమా దెబ్బకు బాక్సాఫీస్ షేక్ మామ.. 30 కోట్లు పెడితే 115 కోట్ల కలెక్షన్స్..