Pawan Kalyan: బ్రో సినిమా పోస్టర్‌లో పవన్ సూపర్ స్టైలిష్ షూ చూశారా.. ధర తెలిస్తే ఫ్యూజులవుట్ అవ్వాల్సిందే..

తమిళ్ లో తెరకెక్కిన వినోదయ సిత్తంకు రీమేక్ గా ఈ సినిమా రానుంది. తెలుగులో ఈ సినిమాను సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.

Pawan Kalyan: బ్రో సినిమా పోస్టర్‌లో పవన్ సూపర్ స్టైలిష్ షూ చూశారా.. ధర తెలిస్తే ఫ్యూజులవుట్  అవ్వాల్సిందే..
Pawan Kalyan
Follow us
Rajeev Rayala

|

Updated on: May 30, 2023 | 11:12 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి సినిమా చేతిశున్న విషయం తెలిసిందే బ్రో అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. తమిళ్ లో తెరకెక్కిన వినోదయ సిత్తంకు రీమేక్ గా ఈ సినిమా రానుంది. తెలుగులో ఈ సినిమాను సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేశారు. ప్రస్తుతం తేజ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో శృతి హాసన్ కనిపించనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవలే ఈ సినిమా పోస్టర్స్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్, తేజ్ పోస్టర్స్ ను సపరేట్ గా రిలీజ్ చేశారు. రీసెంట్ గా పవన్, తేజ్ కలిసి ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అలాగే ఏ పోస్టర్ మిలియన్ వ్యూస్ తో పాటు లక్షల్లో లైక్స్ ను సొంతం చేసుకుంది.

ఇదిలా ఈ పోస్టర్ లో పవన్ స్టైల్ గా బైక్ పై కాలు పెట్టి నుంచున్న లుక్ వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ లో పవన్ స్వాగ్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. అయితే పవన్ వేసుకున్న షూ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. బాల్ మెయిన్ యూనికర్న్ కంపెనీకి చెందిన ఈ షూ ధర ఎంతంటే.. 1207 పౌండ్లు అని తెలుస్తోంది. ఇండియన్ కరెన్సీ లో రూ.106870 గా ఉందని సమాచారం. అలాగే ఈ షూ 82 శాతం నైలాన్ మరియు 14 శాతం ఎలస్టాన్ ఇంకా 4 శాతం థెర్మో ప్లాస్టిక్ పాలీయూరెథాన్ మెటీరియల్ తో తయారు చేశారని తెలుస్తోంది.