AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తెలుగులో కోటి రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరోయిన్.. కానీ అనుకోకుండా సినిమాలకు దూరం.. ఇప్పుడేం చేస్తుందంటే..

ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత హిందీ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. దశాబ్దానికి పైగా ఇండస్ట్రీలో సత్తా చాటిన హీరోయిన్ కు ఆ బ్యూటీకి అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో సినిమాలకు దూరమైంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

Tollywood: తెలుగులో కోటి రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరోయిన్.. కానీ అనుకోకుండా సినిమాలకు దూరం.. ఇప్పుడేం చేస్తుందంటే..
Actress
Rajitha Chanti
|

Updated on: Jul 20, 2024 | 2:25 PM

Share

ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పాన్ ఇండియా హీరోయిన్‏గా దూసుకుపోతుంది. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా దూసుకుపోతుంది. అంతేకాదు.. ఒక్కో సినిమాకు హయ్యేస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటుంది. లక్షలు కాకుండా కోట్లలో పారితోషికం తీసుకునే హీరోయిన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. కానీ తెలుగు సినీ పరిశ్రమలో మొదటిసారి రూ. కోటి రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..? మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత హిందీ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. దశాబ్దానికి పైగా ఇండస్ట్రీలో సత్తా చాటిన హీరోయిన్ కు ఆ బ్యూటీకి అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో సినిమాలకు దూరమైంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..? తనే హీరోయిన్ ఇలియానా.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన దేవదాసు సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత రెండవ సినిమా ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు జోడిగా నటించే ఛాన్స్ అందుకుంది. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పోకిరి సినిమాలో నటించింది. ఈ సినిమాతో ఇలియానా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంది. తెలుగులో స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది. అయితే మాస్ మహారాజా రవితేజ నటించిన ఖతర్నాక్ సినిమాకు ఇలియానా రూ. కోటి రెమ్యునరేషన్ తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. తెలుగులో మొదటిసారి కోటి రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ ఇలియానా అని అప్పట్లో పెద్ద చర్చే నడిచింది. ఈ సినిమా తర్వాత ఇలియానా తన నెక్ట్స్ సినిమాలకు రూ.1.25 కోట్లు పెంచినట్లు సమాచారం.

కానీ కొన్నాళ్లకు ఇలియానాకు తెలుగులో ఆఫర్స్ తగ్గిపోయాయి. ఆ తర్వాత నెమ్మదిగా హిందీలో ఆఫర్స్ అందుకుంది. కానీ అక్కడ కూడా వరుసగా ఆమె సినిమాలు డిజాస్టర్స్ కావడంతో సినిమాలకు దూరమైంది. కొన్నాళ్లపాటు సైలెంట్ అయిన ఇలియానా.. అనుహ్యంగా ప్రెగ్నెన్సీ అంటూ అనౌన్స్ చేసి షాకిచ్చింది. పెళ్లి విషయాన్ని దాచిపెట్టి నేరుగా ప్రెగ్నెన్సీ గురించి అభిమానులతో పంచుకుంది. ఆ తర్వాత తన భర్త, బాబు ఫోటోస్ షేర్ చేస్తూ వైవాహిక బంధం గురించి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఇలియానా తన బాబు, భర్తతో కలిసి విదేశాల్లో ఉంటుంది. అలాగో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన బాబు ఫోటోస్ షేర్ చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?