AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?

Rama Chiluka Story: పక్షులలో రామ చిలుకకు ప్రత్యేక స్థానం ఉంది. చిలుకకు రామ చిలుక అనే పేరు ఎలా వచ్చిందో మీరెప్పుడైనా ఆలోచించారా..? ఒకే భాగస్వామితో జీవితాంతం నిబద్ధతగా ఉండే లక్షణం కారణంగా ఈ పక్షిని రాముడుతో పోలుస్తారు. రాముడు–సీతల దాంపత్యం లాగే విశ్వాసం, అంకితభావం ఈ పేరుకు మూలం.

చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
Rama Chiluka Story
Janardhan Veluru
|

Updated on: Apr 05, 2026 | 10:40 PM

Share

ఒకప్పుడు పెళ్లి అనేది జీవితాంతం నిలిచే బంధంగా భావించేవారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా దంపతులు కలిసి ఉండేవారు. కొన్ని సందర్భాల్లో ఒకే ఇంట్లో ఇద్దరు భార్యలతో జీవించిన సందర్భాలు ఉన్నప్పటికీ, విడాకుల విషయం పెద్దగా వినిపించేది కాదు. పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా, ఇష్టపడి చేసుకున్న పెళ్లి అయినా..ఎన్ని కష్టాలు వచ్చినా పరస్పర సహనంతో జీవితం సాగించేవారు. కానీ నేటి కాలంలో చిన్న చిన్న విభేదాలకే పెద్ద గొడవలు చేసి విడిపోవడం సాధారణంగా మారింది.

ఈ నేపథ్యంలో పక్షులలో ఒక ప్రత్యేకత కలిగినది “రామ చిలుక”. ఈ చిలుకకు ముందు “రామ” అనే పేరు ఎందుకు వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా? రాముడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏకపత్నీవ్రతుడు. సీతమ్మను మాత్రమే వివాహం చేసుకుని, జీవితాంతం ఆమెకే అంకితమయ్యాడు. సీతమ్మ కూడా ఎంత కష్టాలు వచ్చినా రాముడి కోసం ఎదురుచూసి తన నిబద్ధతను చాటింది.

రాముడితో చిలుకకు పోలిక ఇదే..?

చిలుకల స్వభావం కూడా ఇదే విధంగా ఉంటుంది. ఒకసారి ఒక చిలుక మరొక చిలుకతో జతకట్టిన తర్వాత, జీవితాంతం అదే జతతో కొనసాగుతుందని అంటారు. మరో జతను ఎంచుకోవడం చాలా అరుదు. ఈ లక్షణం కారణంగానే చిలుకను రాముడితో పోల్చి “రామ చిలుక” అని పిలుస్తారు. అంటే, రాముడి లాగే ఒకే భాగస్వామితో నిబద్ధతతో జీవించే లక్షణం ఈ పక్షిలో ఉందని భావిస్తారు.

మన సంస్కృతిలో ఇలాంటి విలువలు, సందేశాలు చాలా లోతుగా దాగి ఉన్నాయి. కానీ వాటి అర్థాన్ని గ్రహించడం, వాటిని జీవితంలో అమలు చేయడం కాస్త కష్టమే. రాముడు, సీతల వివాహ జీవితం, వారి వనవాసం వంటి సంఘటనలు తెలుసుకుంటే దాంపత్య బంధం విలువ మరింత స్పష్టంగా తెలుస్తుంది.

ఇప్పటి యువత మాత్రం చిన్న చిన్న సమస్యలకే గొడవలు పెంచుకుని విడిపోవడం సాధారణంగా మారింది. ఒక సంబంధం నిలవకపోతే మరొకదానికి వెళ్తూ, మళ్లీ అదే పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇలా కాకుండా, స్థిరమైన బంధం కోసం ప్రయత్నిస్తేనే నిజమైన ఆనందం లభిస్తుంది. రామ చిలుకలా నిబద్ధత, విశ్వాసం, సహనం మన జీవితాల్లోనూ ఉండాలని కోరుకుంటే, రాముడి మార్గాన్ని అనుసరించాల్సిన అవసరముంది.

Follow Us
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?