Ghajini Movie: సూపర్ హిట్ ‘గజిని’ సినిమాను మిస్ చేసుకున్న హీరోస్ ఎవరో తెలుసా ?.. ఇంతమంది రిజెక్ట్ చేశారా ?..

తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ మూవీని తెలుగులో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ విడుదల చేయగా.. ఎక్కువగానే కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ సూపర్ హిట్ చిత్రాన్ని చాలా మంది హీరోస్ రిజెక్ట్ చేశారు. ఇంతకీ వాళ్లు ఎవరో తెలుసుకుందామా.

Ghajini Movie: సూపర్ హిట్ 'గజిని' సినిమాను మిస్ చేసుకున్న హీరోస్ ఎవరో తెలుసా ?.. ఇంతమంది రిజెక్ట్ చేశారా ?..
Ghajini
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 15, 2023 | 9:24 AM

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన చిత్రాల్లో గజిని ఒకటి. డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ సూర్య నటించిన ఈ సినిమా సెన్సెషన్ క్రియేట్ చేసింది. 2005లో విడుదలైన ఈ మూవీకి తమిళంతోపాటు.. తెలుగులోనూ భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఒక్క సినిమాతో అటు సూర్యకు.. ఇటు మురుగదాస్‏కు తెలుగులో ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా ఈ చిత్రానికి సూర్య్ అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ మూవీని తెలుగులో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ విడుదల చేయగా.. ఎక్కువగానే కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ సూపర్ హిట్ చిత్రాన్ని చాలా మంది హీరోస్ రిజెక్ట్ చేశారు. ఇంతకీ వాళ్లు ఎవరో తెలుసుకుందామా.

కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమాలో ఆసిన్, నయనతార కథానాయికలుగా నటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సాధారణంగా ఒక సినిమాకు ఒకరిద్దరు స్టార్స్ రిజెక్ట్ చేస్తారు. కానీ గజిని చిత్రాన్ని ఏకంగా 13 మంది హీరోస్ రిజెక్ట్ చేశారట. అయిన ఏమాత్రం వెనక్కి తగ్గని మురగదాస్ చివరకు సూర్యతో తెరకెక్కించి హిట్ అందుకున్నారు.

ఈ సినిమాను తెలుగు హీరోలతో తీయాలని ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు స్టోరీ వినిపించారట. కానీ ఒంటినిండా పచ్చబొట్లతో కనిపించాలని అనగానే ఆయన రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత అజిత్ ను ఒప్పించి సినిమా షూటింగ్ ప్రారంభించిన తర్వాత ఆయనకు.. నిర్మాతకు మనస్పర్థలు రావడంతో సినిమా క్యాన్సిల్ అయ్యిందట. ఆ త్రవాత వెంకటేష్, పవన్ కళ్యామ్, కమల్ హాసన్, రజినీ కాంత్, విజయ్ కాంత్, దళపతి విజయ్, శింబు, మాధవన్, సల్మాన్ ఖాన్, విక్రమ్, అజయ్ దేవగన్, సైఫ్, మోహన్ లాల్ ఇలా చాలా మంది హీరోలకు స్టోరీ చెప్పారట. ఒక్కొక్కరు ఒక్కొ కారణంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశారట. చివరకు సూర్యతో ఈ సినిమాను రూపొందిచారట.

హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా