AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఆర్థిక సమస్యలతో చదువుకు ఫుల్ స్టాప్.. ఇప్పుడు ఒక్క సినిమాకు కోట్లు డిమాండ్ చేసే హీరోయిన్..

ఒకప్పుడు ఆర్థిక సమస్యలతో చదువును మధ్యలోనే స్టా్ప్ చేసింది. ఆ తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన ఆ అమ్మాయి.. నెమ్మదిగా మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. షాపింగ్ మాల్స్ లో యాడ్స్ చేసిన ఆమె.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అతి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Tollywood: ఆర్థిక సమస్యలతో చదువుకు ఫుల్ స్టాప్.. ఇప్పుడు ఒక్క సినిమాకు కోట్లు డిమాండ్ చేసే హీరోయిన్..
Actress Movies
Rajitha Chanti
|

Updated on: Nov 10, 2024 | 10:05 PM

Share

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళం, హిందీలో పలు చిత్రాల్లో నటించి నటిగా మెప్పించింది. సహజమైన నటనతో సినీ క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. చేతినిండా సినిమాలతో అగ్ర కథానాయికగా దూసుకుపోతున్న సమయంలోనే వ్యక్తిగత సమస్యలతో సినిమాలకు దూరమయ్యింది. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ వయ్యారి.. తాజాగా మరో హిట్ ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లు డిమాండ్ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. ఒకప్పుడు మాత్రం ఆర్థిక సమస్యలతో చదువుకు మధ్యలో ఫుల్ స్టాప్ పెట్టింది. గత నాలుగేల్లలో ఒకే ఒక్క సినిమా హిట్ అందుకుంది. అయినా ఆమె క్రేజ్, డిమాండ్ ఏమాత్రం మారలేదు. అంతేకాదు.. అటు థియేటర్స్, ఇటు ఓటీటీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ తనే. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ఇంకెవరు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత.

ఏమాయ చేసావే అంటూ తెలుగు తెరకు పరిచయమైన సామ్.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఓ బేబీ, రంగస్థలం, అత్తారింటికి దారేది, దుకుడు వంటి చిత్రాల్లో నటించి అలరించింది. తెలుగుతోపాటు తమిళంలోనూ అనేక సినిమాల్లో నటించింది. అక్కినేని హీరోతో ప్రేమ, వివాహం, బ్రేకప్ తర్వాత సామ్ లైఫ్ పూర్తిగా మారిపోయింది. అదే సమయంలో మయోసైటిస్ సమస్య వేధించడం.. మానసిక సంఘర్షణను ఎదుర్కొని ఇప్పుడు మళ్లీ నటిగా ఇప్పుడు సత్తా చాటుతుంది. కొన్ని నెలలుగా మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకుంటుంది సామ్. అలాగే అప్పుడప్పుడు చిత్త్రాల్లోనూ నటిస్తుంది. చివరిసారిగా ఖుషి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.

ఇక ఆ తర్వాత మరోసారి మయోసైటిస్ చికిత్స తీసుకున్న సామ్.. ఇప్పుడు సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ సినీ ప్రియులను అలరించింది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సామ్ కలిసి నటించిన ఈ సిరీస్ నవంబర్ 8 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. నివేదికల ప్రకారం ఈ సిరీస్ కోసం సామ్ రూ.10 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్