మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చిరుత సినిమాతో హీరోగా పరిచయమైన చరణ్.. రంగస్థలం సినిమాతో నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. ఇందులో చరణ్ యాక్టింగ్ స్కిల్స్ చూసి అడియన్స్, విమర్శకులు సైతం ఆశ్చర్యపోయారు. ఇక ఆ తర్వాత డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో హాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం చరణ్ పేరు మారుమోగింది. ఇక ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో శ్రీకాంత్, అంజలి, కియారా అద్వానీ కీలకపాత్రలు పోషించగా.. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ప్రస్తుతం చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది.
ఇదిలా ఉంటే.. చరణ్ లైఫ్ స్టైల్ గురించి తెలిసిందే. తన ఫ్యాషన్, అద్భుతమైన శైలితోపాటు ఆటో మొబైల్స్, హై ఎండ్ టైమ్ పీస్ లపై ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉన్నాడు. ముఖ్యంగా చరణ్ వాచ్ కలెక్షన్ చూస్తే షాకవ్వాల్సిందే. అయితే ఇటీవల ఓ వెకేషన్ లో చరణ్ అద్భుతమైన రోలెక్స్ ఓయిస్టర్ పెర్పెచువల్ డే-డేట్ 36 ధరించి కనిపించాడు. క్లిష్టమైన జిగ్సా పజిల్-ప్రేరేపిత డిజైన్‌కు ప్రసిద్ధి చెందిన ఈ స్విస్ వాచ్ తెలుపు, గులాబీ, పసుపు బంగారు రంగులలో లభిస్తుంది. ది ఇండియన్ హోరాలజీ ప్రకారం.. ఈ ప్రత్యేకమైన టైమ్‌పీస్ మార్కెట్ ధర పడిపోయే రూ. 2.19 కోట్లు! ఈ విషయం తెలిసి ఈ ధరతో హైదరాబాద్ లో ఓ ఫ్లాట్ కొనొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
ఇదంతా పక్కన పెడితే.. తాజాగా చరణ్ కూతురు క్లింకారా ఫేస్ రివీల్ అయిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగా ప్రిన్సెస్ క్లింకారను చరణ్ ఎత్తుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో క్లింకారను చూసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన