AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: ‘గుంటూరు కారం’ కొత్త పోస్టర్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా మహేశ్‌ బాబు షర్ట్‌.. ధర ఎంతో తెలుసా?

మహేశ్‌ బాబు పుట్టిన రోజు (ఆగస్టు 9)ను పురస్కరించుకుని గుంటూరు కారం నుంచి మరో కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్‌. ఇందులో ఊర మాస్‌ లుక్‌లో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌కు ఫుల్‌ ట్రీట్‌ ఇచ్చారు మహేశ్‌. లుంగీ, షర్ట్‌ ధరించి కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకుని బీడీ కాలుస్తూ ఎంతో స్టైల్‌గా కనిపించారు సూపర్‌ స్టార్‌. దీంతో ఈ పోస్టర్‌ ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మహేశ్‌ లుక్‌ సంగతి పక్కన పెడితే అతను ధరించిన షర్ట్‌ కూడా అభిమానులను బాగా అట్రాక్ట్‌ చేసింది.

Mahesh Babu: 'గుంటూరు కారం' కొత్త పోస్టర్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా మహేశ్‌ బాబు షర్ట్‌.. ధర ఎంతో తెలుసా?
Mahesh Babu
Basha Shek
|

Updated on: Aug 11, 2023 | 6:05 AM

Share

సర్కారు వారి పాట వంటి సూపర్‌హిట్‌ సినిమా తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు నటిస్తోన్న చిత్రం గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. పూజా హెగ్డే ఓ స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. అతడు, ఖలేజా వంటి హిట్‌ సినిమాల తర్వాత మహేశ్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ మూవీ ఇది. అందుకే దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే గుంటూరు కారం నుంచి రిలీజైన పోస్టర్స్‌, గ్లింప్స్‌ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే మహేశ్‌ బాబు పుట్టిన రోజు (ఆగస్టు 9)ను పురస్కరించుకుని గుంటూరు కారం నుంచి మరో కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్‌. ఇందులో ఊర మాస్‌ లుక్‌లో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌కు ఫుల్‌ ట్రీట్‌ ఇచ్చారు మహేశ్‌. లుంగీ, షర్ట్‌ ధరించి కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకుని బీడీ కాలుస్తూ ఎంతో స్టైల్‌గా కనిపించారు సూపర్‌ స్టార్‌. దీంతో ఈ పోస్టర్‌ ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మహేశ్‌ లుక్‌ సంగతి పక్కన పెడితే అతను ధరించిన షర్ట్‌ కూడా అభిమానులను బాగా అట్రాక్ట్‌ చేసింది. దీంతో సహజంగానే ఆ షర్ట్‌ బ్రాండ్‌ నేమ్‌, ధర తదితర విషయాల కోసం గూగుల్‌ను ఆశ్రయించారు.

ఈ క్రమంలో గుంటూరు కారం కొత్త పోస్టర్‌ లో మహేశ్‌ బాబు ధరించిన క్యాజువల్‌ షర్ట్‌ గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఫ్యాషన్ ఫార్‌ఫెచ్ R13కు చెందిన బ్లీచ్ వాష్ ప్లాయిడ్ లాంగ్ స్లీవ్ ధర అక్షరాలా 74,509 రూపాయలని తెలిసింది. దీనిని చూసి అభిమానులు, నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. చూడడానికి ఇంత సింపుల్‌గా ఈ షర్ట్‌ అంత కాస్ట్‌లీనా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అదే సమయంలో మహేశ్‌ బాబు రేంజ్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందేనంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ సినిమాకు తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గుంటూరు కారం సినిమాలో మహేశ్ బాబు న్యూ లుక్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?