RX 100 Movie: అరెరే.. చేతులరా బ్లాక్ బస్టర్ వదిలేసిందే.. ఆర్ఎక్స్ 100 మిస్సైన హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు లేక..

కొన్నిసార్లు సినీ పరిశ్రమలో ఒకటి రెండు చిత్రాలతో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయి.. ఆ తర్వాత అదే స్థాయిలో బ్రేక్ కోసం ఎదురుచూస్తుంటారు. ఆర్ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్ పుత్ సైతం రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. ఇప్పుడు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తుంది.

RX 100 Movie: అరెరే.. చేతులరా బ్లాక్ బస్టర్ వదిలేసిందే.. ఆర్ఎక్స్ 100 మిస్సైన హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు లేక..
Rx 100

Updated on: Nov 28, 2025 | 4:35 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిన తారల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి వారిలో హీరో కార్తికేయ ఒకరు. ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని.. రాత్రికి రాత్రే స్టార్ డమ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత అతడు నటించిన చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పుడు హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ఇక ఇదే సినిమాతో కథానాయికగా అందరి దృష్టిని ఆకర్షించింది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాలోనే గ్లామర్, రొమాన్స్ సీన్లలో నటించి ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.

ఇవి కూడా చదవండి : Cinema : ఇదెక్కడి సినిమా రా బాబూ.. 45 కోట్లు పెట్టి తీస్తే రూ.60 వేల కలెక్షన్స్ రాలేదు.. నిర్మాతలను నిండా ముంచేసింది..

ఇవి కూడా చదవండి

ఆర్ఎక్స్ 100 సినిమాతో కథానాయికగా ఇండస్ట్రీలో సెన్సేషన్ అయ్యింది పాయల్ రాజ్ పుత్. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. హీరోయిన్ గా ఫస్ట్ మూవీ అయినప్పటికీ నెగిటివ్ రోల్ పోషించి అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ఈ చిత్రానికి హీరోయిన్ గా పాయిల్ రాజ్ పుత్ ఫస్ట్ ఛాయిస్ కాదట. ముందుగా ఈ సినిమాకు కథానాయికగా నందిత శ్వేతను అనుకున్నారట. కానీ ఈ సినిమాను ఆమె రిజెక్ట్ చేసిందట. దీంతో ఆమె స్థానంలోకి పాయల్ వచ్చింది. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది పాయల్.

ఇవి కూడా చదవండి :  Prithviraj Sukumaran : ఏంటీ.. ఈ స్టార్ హీరో భార్య టాప్ జర్నలిస్టా.. ? ఫోన్ కాల్‏తో ప్రేమకథ.. లవ్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్టులు..

నందిత శ్వేత సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న కంటెంట్ చిత్రాల్లో నటిస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంది. మితిమిరిన గ్లామర్ షో, ఇంటిమేట్ సీన్స్ చేయడానికి నిరాకరిస్తుంది నందిత శ్వేత. ప్రస్తుతం ఈ బ్యూటీ సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.

ఇవి కూడా చదవండి : Nani : నానితో జెర్సీ సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ? చివరకు ఆ హీరోతో బ్లాక్ బస్టర్..

ఇవి కూడా చదవండి : Tollywood : కుర్రాళ్లకు మెంటలెక్కించిన హీరోయిన్.. కట్ చేస్తే.. అవకాశాల కోసం ఎదురుచూపులు..

Follow Us