
టాలీవుడ్ హీరో.. కానీ పాన్ ఇండియా బాక్సాఫీస్ కింగ్ అతడు. ఈ హీరో నటించిన ప్రతి సినిమా మొదటి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి నటుడిగా అడుగుపెట్టి ఇప్పుడు తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక హీరోగానే కాకుండా నిజ జీవితంలోనూ ఈ హీరోను.. ఆయన వ్యక్తిత్వాన్ని ఆరాధించేవారు చాలా మంది ఉన్నారు. ఇప్పటివరకు కేవలం 7 సినిమాలతోనే రూ.5300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. కొన్నాళ్లుగా అతడు నటించిన ప్రతి సినిమా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. ఆ హీరో సినిమా విడుదలకు ముందే ఓ రేంజ్ హైప్ నెలకొంటుంది. అభిమానులే కాదు.. సినీ ప్రముఖులు సైతం ఆయన సినిమాల కోసం వెయిట్ చేస్తుంటారు. ప్రస్తుతం చేతిలో అరడజనుకు పైగా చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. గత తొమ్మిదేళ్లల్లో కేవలం 7 సినిమాల్లోనే నటించాడు. కానీ అతని సినిమాలు బాక్సాఫీస్ వద్ద రూ.5300 కోట్లు వసూలు చేశాయి. అతడు మరెవరో కాదు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.
దివంగత హీరో కృష్ణం రాజు నటవారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు ప్రభాస్. ఆ తర్వాత వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో అతడి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో తెలుగులో వరుస సినిమాలతో తక్కువ సమయంలోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రభాస్ ఒక నిర్దిష్ట వయస్సు వచ్చే వరకు సినిమాల్లో నటించాలనుకోవడం లేదు. ప్రభాస్ హీరో అవుతాడని తాను ఎప్పుడూ అనుకోలేదని కృష్ణంరాజు స్వయంగా అన్నారు. ప్రభాస్ తన కుటుంబ కార్యక్రమంలో అద్భుతంగా డ్యాన్స్ చేసిన తర్వాత తన పెద్దనాన్నను నేరుగా నేను డ్యాన్స్ చేస్తానా.. ? హీరో అవుతానా ? అని అడిగారట.
ఆ తర్వాత తాను సినిమాల్లోకి రావాలనుకున్నట్లు కృష్ణంరాజుతో చెప్పారట ప్రభాస్. దీంతో వెంటనే కృష్ణంరాజు ప్రభాస్‌ను సత్యానంద్ నటనా పాఠశాలలో చేర్పించాడు. అక్కడ నటనా శిక్షణ పొందిన తర్వాత, ప్రభాస్ ఈశ్వర్ చిత్రంతో హీరోగా మారాడు. 2015లో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు ప్రభాస్. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత తొమ్మిదేళ్లలో ప్రభాస్ మొత్తం 7 సినిమాల్లో నటించాడు. ఈ చిత్రాలన్నీ దాదాపు రూ.5300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. భారతీయ సినిమాల్లో ఈ ఘనత సాధించిన ఏకైక హీరో ప్రభాస్. ప్రస్తుతం రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన