AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna: కింగ్ నాగార్జున ఫోన్‌లో ఒక్క ఫొటో కూడా ఉండదు.. కారణమేంటో తెలుసా?

సాధారణంగా మొబైల్ ఫోన్ ఉందంటే చాలు.. ఎప్పుడంటే ఎప్పుడూ ఫొటోలు, సెల్ఫీలు దిగుతుంటాం. కొందరు కేవలం ఫొటోలు తీసుకోవడానికే ఖరీదైన స్టార్మ్ ఫోన్స్ కొనుగోలు చేస్తుంటారు. అయితే సీనియర్ స్టార్ హీరో కింగ్ నాగార్జున తన మొబైల్ ఫోన్ ఇప్పటివరకు ఒక్క ఫొటో కూడా ఉంచుకోలేదట.

Nagarjuna: కింగ్ నాగార్జున ఫోన్‌లో ఒక్క ఫొటో కూడా ఉండదు.. కారణమేంటో తెలుసా?
Nagarjuna
Basha Shek
|

Updated on: Oct 07, 2026 | 7:07 PM

Share

ప్రస్తుతం కింగ్ నాగార్జున వరుస సినిమాలు, టీవీ షోలతో బిజీ బిజీగా ఉంటున్నారు. ఒక వైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు కుబేర, కూలీ వంటి సినిమాల్లో విలన్ గానూ కీలక పాత్రలు పోషిస్తున్నారు నాగ్. అలాగే ప్రముఖ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. కాగా సినిమాల పరంగా కింగ్ నాగార్జున ఒక అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నారు. ఇప్పటికే 99 సినిమాలతో ఆడియెన్స్ ను అలరించిన కింగ్ త్వరలోనే 100వ సినిమాతో మన ముందుకు రానున్నారు. నాగార్జున నటిస్తోన్న ల్యాండ్ మార్క్ మూవీ ‘కింగ్ 100’. కోలీవుడ్ దర్శకుడు రా. కార్తీక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్, సుష్మితా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే టబు మరో కీలక పాత్రలో నటించనుంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలు, బిగ్ బాస్ షోల సంగతి పక్కన పెడితే.. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన సైబర్ సేఫ్టీ అవేర్‌నెస్ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నాగ్. ఈ కార్యక్రమంలో భాగంగా తన మొబైల్ ఫోన్ వినియోగం, పర్సనల్ డేటా ప్రైవసీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన ఫోన్లో వ్యక్తిగత ఫొటోలను తీసుకోకపోవడం , భద్రపరచుకోవడం వంటి పనులు చేయనని తెలపారు.

‘నేను నా ఫోన్లో వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు దాచుకోను. ఎప్పుడైనా ఫోన్ హ్యాక్ అయితే అందులోని ఫోటోలు, వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ఫోన్ లో సాధ్యమైనంత వరకు వ్యక్తిగత డేటాను నేను స్టోర్ చేసుకోను. సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలు వెతుకుతున్న నేపథ్యంలో.. ముందుగానే నేను సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా అప్రమత్తంగా ఉండడం నేర్చుకున్నాను. ఫోన్ భద్రత విషయంలో నేను పాటించే మరో ముఖ్యమైన జాగ్రత్త.. ప్రతి 15 రోజులకు ఒకసారి నా మొబైల్ పాస్ వర్డ్ ను మారుస్తుంటాను. ఒక్క పాస్ వర్డ్ విషయంలోనే కాదు ఇంటర్నెట్ కనెక్షన్ విషయంలో కూడా అప్రమత్తంగా ఉంటాను. అందుకే వై-ఫై పాస్ వర్డ్ ను కూడా తరచూ ఛేంజ్ చేస్తుంటాను. ఇంతకు ముందు రెండు మూడు నెలలకొకసారి వైఫై పాస్ వర్డ్ మార్చేవాడిని. అయితే ఇప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి పాస్ వర్డ్ మారుస్తున్నా’ అని నాగార్జున చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కింగ్ చెప్పిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కింగ్ నాగార్జున ఫోన్‌లో ఒక్క ఫొటో కూడా ఉండదు.. కారణమేంటో తెలుసా?
కింగ్ నాగార్జున ఫోన్‌లో ఒక్క ఫొటో కూడా ఉండదు.. కారణమేంటో తెలుసా?
దసరా పండుగకు 7 వేల ప్రత్యేక బస్సులు..తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
దసరా పండుగకు 7 వేల ప్రత్యేక బస్సులు..తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
నదిలో నీరు లేక గంగాళాల్లో కూర్చుని వరుణ జపం.. అర్చకుల వినూత్న పూజ
నదిలో నీరు లేక గంగాళాల్లో కూర్చుని వరుణ జపం.. అర్చకుల వినూత్న పూజ
 బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్‌కు.. ఉపయోగపడే కొర్రలతో జావ
 బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్‌కు.. ఉపయోగపడే కొర్రలతో జావ
సోషల్ మీడియాకు దూరంగా ఉంటేనే జీవితం హాయిగా ఉంది..
సోషల్ మీడియాకు దూరంగా ఉంటేనే జీవితం హాయిగా ఉంది..
దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్.. ఈ ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్స్‌!
దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్.. ఈ ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్స్‌!
ఒత్తిడి, ఈఎంఐ టెన్షన్లతో సతమతమవుతున్నారా? ఈ 5 యోగాసనాలతో ప్రశాంతత
ఒత్తిడి, ఈఎంఐ టెన్షన్లతో సతమతమవుతున్నారా? ఈ 5 యోగాసనాలతో ప్రశాంతత
క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ట్విస్ట్ మ్యాచ్ ఇదే..!
క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ట్విస్ట్ మ్యాచ్ ఇదే..!
గారెలు చేస్తున్నారా? కర కర అనాలంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి
గారెలు చేస్తున్నారా? కర కర అనాలంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి
బిగ్‌బాస్‌ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. లిస్టులో ఎవరూ ఊహించని పేర్లు
బిగ్‌బాస్‌ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. లిస్టులో ఎవరూ ఊహించని పేర్లు