AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: ఈ వీకెండ్‌లోనే బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్.. పేర్లు లీక్ చేసిన ఆదిరెడ్డి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఈ వారం డబుల్ ఎంటర్ టైన్మెంట్ ఉండనుంది. ఎలాగంటే ఈ వీకెండ్ లో డబుల్ ఎలిమినేషన్ తో పాటు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంట్రీ కూడా ఉండనుంది. ఈ నేపథ్యంలో ఎవరు బయటకు వెళతారో, ఎవరు హౌస్ లోకి వస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Bigg Boss Telugu 10: ఈ వీకెండ్‌లోనే బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్.. పేర్లు లీక్ చేసిన ఆదిరెడ్డి
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Oct 07, 2026 | 6:34 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా, ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఐదో వారంలోకి అడుగు పెట్టింది. మొదటి వారం నటి ఛైత్ర ఎలిమినేట్ కాగా రెండో వారంలో కృష్ణుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇక మూడో వారం ఎలాంటి ఎలిమినేషన్ జరగకపోగా, నాలుగో వారం అనూహ్యంగా సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇక బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకు సంబంధించి ఐదో వారం వచ్చిందంటే కచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయి. అలా పదో సీజన్ లోనూ చాలా మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా హౌస్ లోకి రానున్నారని సమాచారం. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 14 మంది ఉన్నారు. వీరిలో అమన్, అపూర్వ, రోహిత్, ఝాన్సీ, చరణ్, షాలిని, నరేశ్, రాంప్రసాద్, త్రిగుణ్, ముకేష్ ఈ వారం నామినేషన్స్‌లోకి నిలిచారు. ఈ వీకెండ్ లో డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని, ఇద్దరు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారని టాక్. అదే సమయంలో కొంతమంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, ప్రముఖ యూట్యూబర్, రివ్యూయర్ ఆది రెడ్డి బిగ్ బాస్10 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల పేర్లను లీక్ చేశాడు.

ఆది రెడ్డి అంచనా ప్రకారం.. బిగ్ బాస్ ఏడో సీజన్ లో పాల్గొని గ్రాండ్ ఫినాలే వరకు వచ్చిన ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ శివ్ కుమార్.. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం అతను చేస్తోన్న ‘నిన్ను కోరి’ సీరియల్ నుంచి తప్పుకోవడంతో శివ్ కుమార్ ఎంట్రీ దాదాపు కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ఇక తెలుగు రియాలిటీ షోలతో మంచి కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటరాజ్ మాస్టర్.. గతంలో ప్రసారమైన బిగ్‌బాస్ 5, ఓటీటీ సీజన్‌లో పాల్గొన్నాడు. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పుడు అతని భార్య నీతూ బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ కోసం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనుందట. ఈమె పేరు కూడా దాదాపు ఖరారైందని అంటున్నారు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోలో పాల్గొన్న శ్రీకాకుళం కుర్రాడు ‘నవరసాలు రామకృష్ణ’ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ గా సెలెక్ట్ అయ్యాడని టాక్. వీరితో పాటు రూ.15 లక్షల సూట్ కేసుతో వెళ్లిపోయిన మిథిలేష్ కూడా మళ్లీ హౌస్ లోకి రానున్నాడని సమాచారం.

వీరితో పాటు బిగ్ బాస్ 8వ సీజన్ విజేతగా నిలిచిన నిఖిల్ మాజీ ప్రియురాలు, సీరియల్ హీరోయిన్ కావ్యశ్రీ, జబర్దస్త్ ఫేమ్ నూకరాజు, రాకింగ్ రాకేశ్ పేర్లు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వినిపిస్తున్నాయి. మరి వీళ్లలో ఎవరెవరు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారన్నది తెలియాలంటే ఆదివారం ( అక్టోబర్ 11) సాయంత్రం వరకు వేచి ఉండాల్సిందే.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ తెలుగు సీజన్ లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us