AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లల ఇమ్యూనిటీ పెంచే హెల్దీ స్వీట్.. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే క్యాండీ

శీతాకాలంలో విరివిగా లభించే పెద్ద ఉసిరికాయల్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి సహజ రోగనిరోధక శక్తిని అందించి దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. అయితే ఉసిరిలోని వగరు మరియు పులుపు కారణంగా పిల్లలు వీటిని నేరుగా తినడానికి అస్సలు ఇష్టపడరు. సాధారణంగా చేసే ఆమ్లా క్యాండీని పంచదారలో నానబెట్టి, రోజుల తరబడి ఎండలో ఎండబెట్టాల్సి వస్తుంది. కానీ ఎండతో పనిలేకుండా.. ఉసిరికాయలను ఆవిరిపై ఉడికించి పేస్ట్‌లా చేసి, ఆరోగ్యానికి మేలు చేసే పటిక బెల్లం (మిశ్రీ), అల్లం, నిమ్మరసం కాంబినేషన్‌లో పాన్ మీదే జెల్లీ ముక్కల్లాంటి సాఫ్ట్ క్యాండీని తయారుచేసుకోవచ్చు.

Phani CH
|

Updated on: Oct 07, 2026 | 6:29 PM

Share
కావలసిన పదార్థాలు: సుమారు 400 గ్రాములు పెద్ద ఉసిరికాయలు, 400 గ్రాముల పటిక బెల్లం, 1 చిన్న ముక్క  సన్నగా తరిగిన తాజా అల్లం, 1 టీస్పూన్ ఉప్పు, 1 రసం తీసిన పెద్ద నిమ్మకాయ, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల పంచదార పొడి

1 / 5
తయారీ విధానం: 400 గ్రాముల ఉసిరికాయలను మచ్చలు లేకుండా చూసుకుని శుభ్రంగా కడగాలి. స్టవ్‌పై గిన్నెలో అర లీటరు (500 ml) నీళ్లు పోసి వేడెక్కనివ్వాలి. నీటిపై జల్లెడ పాత్రను ఉంచి కడిగిన ఉసిరికాయలను పేర్చాలి. నీటిలో వేసి ఉడికిస్తే విటమిన్ సి నీటితో పాటు పోతుంది, అందుకే ఆవిరిపై ఉడికించాలి. మూతపెట్టి హై ఫ్లేమ్‌పై 8 నుండి 10 నిమిషాలు ఉడికించాలి. చాకు గుచ్చితే సులభంగా దిగి, కాయలు పగుళ్లు రాగానే దించి చల్లారనివ్వాలి.

2 / 5
గోరువెచ్చగా చల్లారిన ఉసిరికాయల నుంచి గింజలను తీసి ముక్కలుగా విడదీయాలి. ఈ ముక్కలను మిక్సీ జార్‌లో వేసి.. అందులో అల్లం ముక్కలు, 1 టీస్పూన్ ఉప్పు వేయాలి. చుక్క నీరు కూడా పోయకుండా మెత్తటి వెన్నలాంటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు పోస్తే క్యాండీ ముక్కలుగా కట్ చేయడానికి రాదు. స్టవ్‌పై పాన్ పెట్టి గ్రైండ్ చేసిన ఉసిరి పేస్ట్, దంచి పెట్టుకున్న 400 గ్రాముల పటిక బెల్లం పలుకులు వేయాలి. మంటను సిమ్‌లో ఉంచి పటిక బెల్లం పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగాక మిశ్రమం పలచనవుతుంది; అప్పుడు లో-మీడియం మంటపై దగ్గరపడే వరకు నిదానంగా ఉడికించాలి.

3 / 5
మిశ్రమం చిక్కబడ్డాక ఒక పెద్ద నిమ్మకాయ రసం పిండాలి (నిమ్మరసం వల్ల తీపి-పులుపు రుచి రావడమే కాకుండా క్రిస్టల్స్ ఏర్పడకుండా ముక్క సాఫ్ట్‌గా ఉంటుంది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలపాలి. మిశ్రమం పాన్ నుండి విడివడి ముద్దలా కదులుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. నెయ్యి రాసిన బటర్‌పేపర్‌పై ఈ మిశ్రమాన్ని వేసి చపాతీ కర్రతో లేదా చేత్తో 1 ఇంచు మందంతో సమానంగా లెవల్ చేయాలి.

4 / 5
పూర్తిగా చల్లారిన తర్వాత చాకుతో చిన్న చిన్న చతురస్రాకార క్యాండీ ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇష్టం ఉంటే కొన్ని ముక్కలకు పంచదార పొడిని కోట్ చేసుకోవచ్చు. గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరుచుకుంటే బయట 3 నెలలు, ఫ్రిడ్జ్‌లో ఏడాది పాటు నిల్వ ఉంటాయి. పిల్లలైనా పెద్దలైనా రోజుకో ముక్క తింటే జలుబు చేయకుండా అమితమైన ఆరోగ్యం, జీర్ణశక్తి చేకూరుతాయి !

5 / 5
Follow Us