AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గారెలు చేస్తున్నారా? కర కర అనాలంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి

బతుకమ్మ పండుగ మొదలు అవుతుంది. ఇక ప్రతి ఒక్కరి ఇంటి వద్ద సందడి మొదలు అవుతుంది. అయితే సమయంలో రకరకాల పిండి వంటలు తయారు చేస్తుంటారు. అందులో గారెలు కూడా ఒకటి. అయితే మీరు కూడా మీ కుటుంబ సభ్యుల కోసం గారెలు ప్రిపేర్ చేస్తున్నారా? అయితే ఇవి చాలా రుచికరంగా, కరకర అనేలా ఉండాలి అంటే తప్పకుండా తయారు చేసే సమయంలో కొన్ని చిట్కాలు పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Oct 07, 2026 | 6:38 PM

Share
గారెలు చాలా మంది ఇష్టం ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ వీటిని ఇష్టంగా తింటారు. ఇక కొన్ని చోట్ల వీటిని చెక్కలు అంటే, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో గారెలు అని పిలుస్తుంటారు. ఇక వీటిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే : కారం, బియ్యం పిండి, వేరుశనగ పప్పు, పుట్నాల పప్పు, ధనియాల పౌడర్, కొత్తిమీర, కరివేపాకు, కారం, ఉప్పు, నువ్వులు, వెల్లుల్లి జీలకర్ర రసం. ఆనియన్ పేస్ట్,బట్టర్.

1 / 5
తయారీ విధానంలోకి వెళ్లితే :  ముందుగా, మిక్సీ జార్‌లో  అల్లం,  వెల్లుల్లి రెబ్బలు,  పచ్చిమిరపకాయలు, ఒక టీస్పూన్ జీలకర్ర, రెండు టీస్పూన్ల ధనియాలు వేసి కాస్త కోర్స్‌గా గ్రైండ్ చేయాలి.  ఒక పెద్ద బౌల్‌లో రెండు కప్పుల పొడి బియ్యప్పిండిని జల్లించుకోవాలి.  తర్వాత స్టవ్ ఆన్ చేసి, పాన్‌లో ఒకటిన్నర కప్పుల నీటిని తీసుకోవాలి . ఈ నీటిలో గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి మిశ్రమం, నానబెట్టిన పచ్చిశనగపప్పు, పెసరపప్పు, కారం, ఉప్పు,  ఒక టేబుల్‌స్పూన్ బట్టర్ వేసి బాగా మరిగించాలి. బట్టర్ పూర్తిగా కరిగి నీళ్లు మరగడం మొదలవ్వగానే స్టవ్ ఆఫ్ చేయాలి.

2 / 5
స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే, జల్లించి పెట్టుకున్న బియ్యప్పిండిని మరిగిన నీటిలో వేసి బాగా కలపాలి. ఇందులోనే సన్నగా తరిగిన రెండు టేబుల్‌స్పూన్ల కరివేపాకును కూడా వేసి కలపాలి. కరివేపాకు చెక్కలకు మంచి ఫ్లేవర్‌ను, క్రిస్పీనెస్‌ను ఇస్తుంది. ఈ మిశ్రమాన్ని మూత పెట్టి ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి, పిండి కాస్త ఉమ్మగిల్లుతుంది. ఐదు నిమిషాల తర్వాత, పిండిని మరొక బౌల్‌లోకి తీసుకుని, కొద్దికొద్దిగా నార్మల్ వాటర్ చల్లుతూ సాఫ్ట్‌గా కలిపి పిండి ముద్దలా చేసుకోవాలి.

3 / 5
తర్వాత పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోని, చక్కెల ఆకారంలో తయారు చేసుకోవాలి. తర్వాత గారెలు చేసే మిషన్‌పై బటర్ పేపర్ పెట్టి, కొద్దిగా నూనె రాసి గారెల ఆకారంలో తయారు చేసుకోవాలి. మెషిన్ లేకపోతే చేతిలో అయినా ఒత్తుకోవచ్చు.  మీరు ఎంత పల్చగా గారెలు ఒత్తుకుంటే అవి అంత రుచికరంగా కరకర అంటూ ఉంటాయి.

4 / 5
తర్వాత స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టాలి. తర్వాత బౌల్ పెట్టి  డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేసి బాగా వేడి చేయాలి. నూనె వేడయ్యాక, గారెలను నూనెలో వేసి మీడియం నుండి హై ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఒకటి రెండు నిమిషాల తర్వాత తిప్పుతూ, బంగారు రంగు వచ్చేవరకు ఫ్రై చేయాలి. బయటికి తీసిన తర్వాత రంగు ఇంకాస్త మారుతుంది కాబట్టి, లేత బంగారు రంగులో ఉన్నప్పుడే తీసేయాలి.

5 / 5
Follow Us