Arundhati Movie: అరెరే.. అమ్మడు బంపర్ ఆఫర్ మిస్సైందే.. అరుంధతి సినిమాకు ఆ మలయాళీ హీరోయిన్ ఫస్ట్ చాయిస్..
డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ హార్రర్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. దాదాపు 13 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాగే అటు మ్యుజికల్ హిట్‌గాను నిలిచింది. అప్పట్లో తెలుగులో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ సినిమా తర్వాత తెలుగులో అనుష్కకు వరుస ఆఫర్స్ క్యూకట్టాయి. అరుంధతి సినిమాతో అనుష్క నటనకు తెలుగు అడియన్స్ ఫిదా అయ్యారు.

టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పిన సినిమా అరుంధతి. తెలుగు సినిమా ప్రపంచంలో అనుష్కను అగ్రకథానాయికగా నిలబెట్టిన సినిమా ఇది. ఇందులో జేజమ్మ పాత్రలో అనుష్క అద్భుతమైన నటనతో విమర్శకులను మెప్పించింది. 2009లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ హార్రర్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. దాదాపు 13 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాగే అటు మ్యుజికల్ హిట్‌గాను నిలిచింది. అప్పట్లో తెలుగులో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ సినిమా తర్వాత తెలుగులో అనుష్కకు వరుస ఆఫర్స్ క్యూకట్టాయి. అరుంధతి సినిమాతో అనుష్క నటనకు తెలుగు అడియన్స్ ఫిదా అయ్యారు.
ఎక్కువగా గ్లామర్ పాత్రలతో మెప్పించినా అనుష్క.. అరుంధతి సినిమాతో జేజమ్మగా స్క్రీన్ పై మ్యాజిక్ చేసింది. దీంతో ఓవర్ నైట్ లో క్రేజ్ మారిపోయింది. తెలుగు సినీ పరిశ్రమలో అనుష్క కెరీర్ మలుపు తిప్పిన ఈ సినిమాకు స్వీటీ ఫస్ట్ ఛాయిస్ మాత్రం కాదట. ఈ సినిమా కోసం చాలా మంది హీరోయిన్ల పేర్లను పరిశీలించారట. చివరకు అరుంధతి పాత్ర కోసం మలయాళీ హీరోయిన్ మమతా మోహన్ దాస్‌ను అనుకున్నారట. ఈ మూవీతోనే తెలుగు సినీ పరిశ్రమకు మమతా మోహన్ దాస్ పరిచయం కావాల్సి ఉంది. ఈ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. డైరెక్టర్ తోపాటు.. ప్రొడక్షన్ హౌస్ గురించి ఓ మేనేజర్ చెప్పిన మాటలు నమ్మి ఈ సినిమాను వదులుకుందట మమతా. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
మమతా కాదనడంతో ఆమె స్థానంలోకి అనుష్కను తీసుకున్నారు. సూపర్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఆ తర్వాత ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసింది. కానీ అరుంధతి సినిమా మాత్రం ఆమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఇక అనుష్క కెరీర్ లో అరుంధతి తర్వాత బాహుబలి చిత్రాలు ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాలు. కొన్నాళ్లుగా చిత్రాలకు దూరంగా ఉన్న అనుష్క.. మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
