ఇమాన్వీ.. అలియాస్ ఇమాన్ ఇస్మాయిల్.. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోన్న పేరు. మొన్నటివరకు నెట్టింట రీల్స్ చేస్తూ.. సినిమాల్లోని పాటలకు అందంగా డ్యాన్స్ చేసిన ఈ అమ్మాయి త్వరలోనే వెండితెరపై కనిపించనుంది. ఇన్ స్టాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసింది. డైరెక్టర్ హను రాఘవపూడి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో రాబోతున్న కొత్త ప్రాజెక్టులో ఇమాన్వీ కథానాయికగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. ఈవేడుకలో ప్రభాస్ సరసన ఈ అమ్మాయి హీరోయిన్ అంటూ చిత్రయూనిట్ పరిచయం చేయడంతో ఒక్కసారిగా నెట్టింట సెన్సెషన్ అయ్యింది ఇమాన్వీ. దీంతో ఈ అమ్మడు గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. అంతేకాదు ఒక్కరోజులోనే ఇమాన్వీకి లక్షకు పైగా ఫాలోవర్స్ పెరిగారంటే ఈ బ్యూటీ క్రేజ్ ఇన్ స్టాలో ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇందులో ప్రభాస్ జోడిగా డ్యాన్సర్ కమ్ కొరియోగ్రాఫర్ అయిన సోషల్ మీడియా స్టార్ ఇమాన్వీని సెలక్ట్ చేయడంతో మూవీపై మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. తొలి సినిమానే పాన్ ఇండియా స్టార్ హీరో సరసన రావడంతో ఇమాన్వీ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఈ మూవీ కోసం ఇమాన్వీ తీసుకునే రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు నెట్టింట ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.
లేటేస్ట్ టాక్ ప్రకారం ఫస్ట్ మూవీ కోసం ఇమాన్వీ ఏకంగా రూ.1 కోటి పారితోషికం తీసుకుంటుందని సమాచారం. అయితే ఈ విషయం పై ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న న్యూస్ ప్రకారం ప్రభాస్ సినిమా కోసం ఇమాన్వీ కోటి పారితోషికం తీసుకుంటుందట. గతంలో మళ్లీశ్వరి సినిమా కోసం కత్రినా కైఫ్ ఏకంగా రూ.కోటి పారితోషికం తీసుకున్న సంగతి తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.