AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aaruguru Pathivrathalu: ఆరుగురు పతివ్రతలు హీరోయిన్ గుర్తుందా.? ఆమె ఎక్కడుంది.? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

టాలీవుడ్ లో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ అంటే ఓ బ్రాండ్ ఉంది. కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఈ సీనియర్ దర్శకుడు. అలాంటి ఈవీవీ ఎవ్వరూ ఉంచని సినిమా చేసి ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. ఆ సినిమానే ఆరుగురు పతివ్రతలు. అప్పట్లో ఈ సినిమాసంచలనంగా మారింది. చాలా మందిఈ సినిమా పై విమర్శలు చేశారు. ఈవీవీలాంటి దర్శకుడు ఇలాంటి సినిమా చేయడం పై పలువురు విమర్శలు చేశారు.

Aaruguru Pathivrathalu: ఆరుగురు పతివ్రతలు హీరోయిన్ గుర్తుందా.? ఆమె ఎక్కడుంది.? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
Aaruguru Pathivrathalu
Rajeev Rayala
|

Updated on: Aug 07, 2024 | 12:47 PM

Share

కొన్ని సినిమాలు థియేటర్స్ లో పెద్దగా రాణించకపోయినా.. టీవీల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాయి. అలాగే కొంతమంది హీరోయిన్స్కూడా ఒకటి రెండు సినిమాలతో క్రేజ్ తెచ్చుకొని ఆతర్వాత కనిపించకుండా మాయం అవుతుంటారు. అలాంటి వారిలో పైనున్న హీరోయిన్ ఒకరు. టాలీవుడ్ లో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ అంటే ఓ బ్రాండ్ ఉంది. కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఈ సీనియర్ దర్శకుడు. అలాంటి ఈవీవీ ఎవ్వరూ ఉంచని సినిమా చేసి ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. ఆ సినిమానే ఆరుగురు పతివ్రతలు. అప్పట్లో ఈ సినిమాసంచలనంగా మారింది. చాలా మందిఈ సినిమా పై విమర్శలు చేశారు. ఈవీవీలాంటి దర్శకుడు ఇలాంటి సినిమా చేయడం పై పలువురు విమర్శలు చేశారు. ఇక ఆరుగురు ప్రతివతలు సినిమాలో మెయిన్ రోల్ పోషించిన నటి పేరు అమృత. అయితే ఈమె కన్నడ సినీ పరిశ్రమకు చెందినది. ఈమెను దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ రావు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ సినిమాలో ఆమె నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

2004లో తెరకెక్కించిన చిత్రం ‘ఆరుగురు పతివ్రతలు’. ఈ మూవీలోని సన్నివేశాలు ఇప్పటికీ మీమర్స్‌కు పెద్ద ఫీస్ట్ మాత్రమే కాదు.. ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఆరుగురు పతివ్రతలు 2004 ఫిబ్రవరి 6న విడుదలయ్యింది. ఇ.వి.వి.సినీమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని ఇ.వి.వి.సత్యనారాయణ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. చలపతిరావు, ఎల్.బి.శ్రీరామ్‌, శ్రీకృష్ణ కౌశిక్‌లు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాకు కమలాకర్ సంగీతాన్నందించారు.

ఇక ఈ చిత్రంలో అటు మొగుడు.. ఇటు లవర్ మధ్య నలిగిపోయిన మహిళ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు అమృత. అమృత చేసిన సినిమాలు తక్కువే.. ఆమె మొత్తంగా ఓ ఎనిమిది సినిమాలు చేసింది. ఆ తర్వాత అమృత సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. 2009లో ‘జోడి నెంబర్ 1’ అనే కన్నడ చిత్రం ఆమె నటించిన చివరి మూవీ. కాగా, వెండితెరకు దూరమైన అమృత.. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఆమె ఎలా ఉన్నారని, ఎక్కడ ఉన్నారని చాలా మంది నెటిజన్లు గూగుల్‌ను గాలిస్తున్నారు. కానీ ఆమె డీటైల్స్ ఎక్కడా కనిపించడం లేదు.

Amrutha Anandamayi

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.